MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vv-vinayak21ffa52b-7463-4fa0-86da-54b5be56bb4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vv-vinayak21ffa52b-7463-4fa0-86da-54b5be56bb4b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మాస్ దీక్షకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వివి వినాయక్ ఒకరు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కీర్తి చావ్లా హీరోయిన్గా రూపొందిన ఆది మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమాకు హీరోయిన్ ని సెలెక్ట్ చేసే విషయంలో వివి వినాయక్ అనేక మంది హీరోయిన్స్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారు ఎవరు .. ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. తన మొదటి సినిమా కావడంతో వినాయక్ కచ్చితంగా హీరోయిన్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదు అని , హీరోకు తగ్గ హీరోయిన్ కావాలిvv vinayak{#}Sada;aarti agarwal;keerthi chawla;v v vinayak;AdiNarayanaReddy;Trisha Krishnan;Akkineni Nagarjuna;BEAUTY;Heroine;Mass;Yevaru;Jr NTR;NTR;Cinema"ఆది" మూవీ కోసం ఆ నలుగురు స్టార్ హీరోయిన్లను రిజెక్ట్ చేసిన వినాయక్..?"ఆది" మూవీ కోసం ఆ నలుగురు స్టార్ హీరోయిన్లను రిజెక్ట్ చేసిన వినాయక్..?vv vinayak{#}Sada;aarti agarwal;keerthi chawla;v v vinayak;AdiNarayanaReddy;Trisha Krishnan;Akkineni Nagarjuna;BEAUTY;Heroine;Mass;Yevaru;Jr NTR;NTR;CinemaWed, 07 Aug 2024 13:44:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మాస్ దీక్షకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వివి వినాయక్ ఒకరు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కీర్తి చావ్లా హీరోయిన్గా రూపొందిన ఆది మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమాకు హీరోయిన్ ని సెలెక్ట్ చేసే విషయంలో వివి వినాయక్ అనేక మంది హీరోయిన్స్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారు ఎవరు .. ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. తన మొదటి సినిమా కావడంతో వినాయక్ కచ్చితంగా హీరోయిన్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదు అని , హీరోకు తగ్గ హీరోయిన్ కావాలి అని వెతుకులాటను మొదలు పెట్టాడట.

అందులో భాగంగా మొదట ఆర్తి అగర్వాల్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అనుకున్నాడట. కాకపోతే ఆమె అప్పటికే నువ్వు నాకు నచ్చవు సినిమాకు డేట్స్ ఇవ్వడంతో ఏమీ చేయలేక వినాయక్ ఆమె కాకుండా వేరే హీరోయిన్ను వెతికే పనిలో పడ్డాడట. ఆ తర్వాత నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ సినిమాలో హీరోయిన్గా నటించిన అయేషా టాకీయా ను కూడా హీరోయిన్గా అనుకున్నాడట. కాకపోతే ఈ బ్యూటీ ఎన్టీఆర్ పక్కన బాగుంటుందో లేదో అనే అనుమానంతో ఈమెను కూడా రిజెక్ట్ చేశాడట.

ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో వినాయక్ , త్రిష ను చూశాడట. ఆమెను సెలెక్ట్ చేద్దాము అని ప్రయత్నాలు చేశాడట. కాకపోతే పలువురు ఆమె ఎన్టీఆర్ పక్కన బాగోదు అని చెప్పడంతో ఆమెను కూడా రిజెక్ట్ చేసుకున్నాడట. ఇక ఒకానొక సమయంలో సదా ను కూడా హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నాడట. కానీ ఆమె కూడా వీలు కాలేదట. ఇక ఆఖరుగా ఒక సినిమాలో కీర్తి చావ్లా ను చూడడం , ఆమె ఎన్టీఆర్ సరసన బాగుంటుంది అనే ఆలోచనతో వినాయక్ ఈ బ్యూటీ ని కలవడం ఈ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలా ఆది మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>