MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb2d38784-a288-4122-9510-1bbd2373ac06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb2d38784-a288-4122-9510-1bbd2373ac06-415x250-IndiaHerald.jpgమాస్ కి దాస్ విశ్వక్ సేన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరో. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో తాజాగా ‘మెకానిక్ రాకీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ర‌వితేజ ముళ్ళ‌పూడి డైరెక్ట్ చేస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైట‌న‌ర్ గా ఈ సినిమా రానుంది. ఇక ఇందులో అందాల భామ‌లు మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా కథ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. కానీ, విశ్వక్ tollywood{#}ashok;Genre;Viswak sen;Mangli;ram pothineni;Telugu;Mass;Evening;Music;Cinema;Heroవిశ్వక్ సేన్ ”గుల్లెడు గుల్లెడు” సాంగ్ ప్రోమో..!!విశ్వక్ సేన్ ”గుల్లెడు గుల్లెడు” సాంగ్ ప్రోమో..!!tollywood{#}ashok;Genre;Viswak sen;Mangli;ram pothineni;Telugu;Mass;Evening;Music;Cinema;HeroTue, 06 Aug 2024 18:06:11 GMTమాస్ కి దాస్ విశ్వక్ సేన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరో. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో తాజాగా  ‘మెకానిక్ రాకీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ర‌వితేజ ముళ్ళ‌పూడి డైరెక్ట్ చేస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైట‌న‌ర్ గా ఈ సినిమా రానుంది.  ఇక ఇందులో అందాల భామ‌లు మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా కథ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. కానీ, విశ్వక్ సేన్ ఒక

 మెకానిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కు మేక‌ర్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సుద్ధాల అశోక్ తేజ త‌న‌దైన లిరిక్స్ తో ఆక‌ట్టుకునే విధంగా ఈ పాట‌ను రాయ‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ జేక్స్ బిజోయ్ అదిరిపోయే ఫోక్ బీట్స్ తో ఈ పాట‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ల‌నున్న‌ట్లు ఈ ప్రోమో చూస్తే అర్థ‌మవుతోంది. ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు ఫోక్ సంగీతం

 అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అలాంటి ఫోక్ సంగీతానికి మరో ఉదాహరణగా నిలిచింది ‘గుల్లెడు గుల్లెడు’ పాట. ఈ పాటలోని మరింత ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఈ పాటను పాడారు. ఆమె మధురమైన స్వరం ఈ పాటకు మరింత అందాన్ని చేర్చింది.మొత్తానికి మాస్ కా దాస్ ఓ ప్యూర్ ఫోక్ సాంగ్ తో ఆడియెన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పాట‌ను ఆగ‌స్టు 7న సాయంత్రం 4.04 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు మేకర్స్. ఇది ఇలా ఉంటే రామ్ తాళ్ళూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా పై తెలుగు సినీ ప్రేమికులందరిలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>