PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-kinjarapu-familys6fedf6b9-031d-4810-8d87-1c91b5444373-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-kinjarapu-familys6fedf6b9-031d-4810-8d87-1c91b5444373-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి, నారా, వైఎస్ వంటి ఫ్యామిలీల నుంచి చాలామంది రాజకీయాల్లో అడిగి పెట్టారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరి లాంటి వాళ్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఫ్యామిలీ లతో పాటు మరో ఫ్యామిలీ కూడా ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆ ఫ్యామిలీ మరేదో కాదు, కింజరాపు ఫ్యామిలీ! అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, రామ్ మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవాని ఇలా కింజారపు కుటుంబం నుంచి నలుగురు ఏపీ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్Kinjarapu familys{#}ram mohan;rani;ADIREDDY BHAVANI;ATCHANNAIDU KINJARAPU;Srikakulam;University;Cabinet;central government;Kinjarapu Yerran Naidu;Tekkali;Daggubati Purandeswari;ram pothineni;CBN;Assembly;TDP;Father;Hanu Raghavapudi;Andhra Pradeshకుటుంబ రాజకీయాలు: ఏపీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీగా కింజరాపు ఫ్యామిలీ రికార్డు..?కుటుంబ రాజకీయాలు: ఏపీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీగా కింజరాపు ఫ్యామిలీ రికార్డు..?Kinjarapu familys{#}ram mohan;rani;ADIREDDY BHAVANI;ATCHANNAIDU KINJARAPU;Srikakulam;University;Cabinet;central government;Kinjarapu Yerran Naidu;Tekkali;Daggubati Purandeswari;ram pothineni;CBN;Assembly;TDP;Father;Hanu Raghavapudi;Andhra PradeshTue, 06 Aug 2024 09:19:00 GMT* ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కింజరాపు ఫ్యామిలీ

* అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, రామ్ మోహన్, ఆదిరెడ్డి భవాని ఎంట్రీ

* విశేషమైన సేవలు అందిస్తూ మంచి పేరు

( ఏపీ ఇండియా - హెరాల్డ్)


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి, నారా, వైఎస్ వంటి ఫ్యామిలీల నుంచి చాలామంది రాజకీయాల్లో అడిగి పెట్టారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరి లాంటి వాళ్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఫ్యామిలీ లతో పాటు మరో ఫ్యామిలీ కూడా ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆ ఫ్యామిలీ మరేదో కాదు, కింజరాపు ఫ్యామిలీ! అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, రామ్ మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవాని ఇలా కింజారపు కుటుంబం నుంచి నలుగురు ఏపీ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు వీరందరూ కూడా ఆయా నియోజకవర్గం నుంచి గెలిచి తమ సత్తా చాటారు. వీళ్ళలో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం.
   
అచ్చెన్నాయుడు 1996, 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2019లో టెక్కలి నుంచి గెలిచి చంద్రబాబు హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 2024లో టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు హ్యాట్రిక్‌ విన్ సాధించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు.

అచ్చెన్నాయుడు బ్రదర్ కింజరాపు ఎర్రన్నాయుడు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది 1982లో టీడీపీలో చేరారు. 1983, 1985లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మళ్లీ టీడీపీలో చేరి 1994లో మళ్లీ గెలిచారు. చంద్రబాబు తిరుగుబాటుకు మద్దతిస్తూ, మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యారు. 1996లో లోక్‌సభకు ఎన్నికై, గ్రామీణాభివృద్ధి, ఉపాధి మంత్రిగా పనిచేశారు. 1998, 1999లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2004లో నక్సలైట్ల హత్యాయత్నం నుండి బయటపడి, తిరిగి ఎన్నికైనప్పటికీ 2009లో కాంగ్రెస్‌కి చెందిన కిల్లి కృపా రాణి చేతిలో ఓడిపోయారు. ఈయన 55 ఏళ్ల వయసులో చనిపోయారు.

కింజరాపు రామ్ మోహన్ తన తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 2012లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటినుంచి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో గెలిచి, 16వ లోక్‌సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. 2024లో మళ్లీ భారీ మెజార్టీతో గెలిచి ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని టీడీపీ తరపున 2019 రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచారు. అలా తొలిసారి శాసనసభ సభ్యురాలు అయ్యారు. ఇలా కింజరాపు ఫ్యామిలీ ఏపీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీగా నిలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>