PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stitching-machinesd66176c7-2b9c-46d9-9534-b16876d1be8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stitching-machinesd66176c7-2b9c-46d9-9534-b16876d1be8a-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్తను తెలియజేసింది. ముఖ్యంగా వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక యంత్రాలు, పనిముట్లు ఇస్తోంది. అయితే వాటిని కేంద్రం ఇవ్వకుండా మనీ ఇస్తూ ఆ డబ్బుతో కొనుక్కునేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుట్టుమిషన్ కూడా ఇదే వర్గానికి చెందుతుంది. కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ .15000 రూపాయలు పొందవచ్చు.STITCHING MACHINES{#}Application;Bank;Prime Minister;Governmentమహిళలకి గుడ్ న్యూస్.. త్వరలోనే కుట్టు మిషన్లు ..!మహిళలకి గుడ్ న్యూస్.. త్వరలోనే కుట్టు మిషన్లు ..!STITCHING MACHINES{#}Application;Bank;Prime Minister;GovernmentTue, 06 Aug 2024 11:05:13 GMTకేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్తను తెలియజేసింది.  ముఖ్యంగా వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక యంత్రాలు,  పనిముట్లు ఇస్తోంది.  అయితే వాటిని కేంద్రం ఇవ్వకుండా మనీ ఇస్తూ ఆ డబ్బుతో కొనుక్కునేలా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే కుట్టుమిషన్ కూడా ఇదే వర్గానికి చెందుతుంది.  కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అమలు చేస్తున్నారు.  ఈ పథకంలో భాగంగా కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ .15000 రూపాయలు పొందవచ్చు. ఆ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి ప్రభుత్వం వేస్తుంది. అయితే ఒక వారం డిజిటల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఆ సమయంలో మీరు రోజుకు రూ.500 చొప్పున డబ్బులు తీసుకోవచ్చు. ఇక కుట్టుమిషన్ కొన్న తర్వాత లక్ష రూపాయలను కేంద్రం రుణం కింద ఇప్పిస్తుంది.  దానిని మీరు 18 నెలల్లో పూర్తి చేశాక. మరో రూ .2లక్షల వరకు రుణం పొందవచ్చు.  దానిని మీరు మరో 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. 

ఇకపోతే కేంద్రం కుట్టుమిషన్ కొనుక్కునే వారికి అలాగే షాప్ పెట్టుకోవడానికి ఈ రుణం ఇప్పిస్తోంది. అంతేకాదు తక్కువ వడ్డీకే రుణాలను అందజేస్తూ ఉండడం గమనార్హం.ఇక ఈ పథకానికి మహిళలే కాదు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఆ పథకానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. ఇప్పటికే కుట్టు పని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఇందులో దరఖాస్తుదారుల వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. దరఖాస్తు కు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, చిరునామా  ప్రూఫ్,  గుర్తింపు కార్డు,  కుల ధ్రువీకరణ పత్రం,  పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు బ్యాంకు పాస్ బుక్, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. అలాగే https://pmvishwakarma.gov.in లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలి. ఆన్లైన్ కుదరకపోతే దగ్గరలో ఉండే మీసేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేయించవచ్చు. ప్రాసెస్ పూర్తయిన కొద్ది రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తే ఫలితంగా మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేయవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>