PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/putin3926b2e6-4b6f-47a5-a40a-70c7f87a3b7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/putin3926b2e6-4b6f-47a5-a40a-70c7f87a3b7c-415x250-IndiaHerald.jpgఅది 2024 ఆగష్టు 1 మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే ల్యాండైన ఓ విమానం నుంచి ఎనిమిది మంది ప్రత్యేక భద్రతా అధికారులు బయటకు వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్ చేసుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు వీఐపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు. ఐదేళ్ల క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్. చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ కార్యాలయానికి, పార్లమెంట్ కి కూత వేటు దూరంలో ఉన్న ఓ పార్కులో సైకిల్ పై వస్తున్న వ్యక్తి సడెన్ గా గన్ తీసి తన ముందు నడుస్తున్న మాజా చెచెన్ రెబల్ putin{#}jeevitha rajaseskhar;Russia;Germany;AdiNarayanaReddy;Moscow;Parliment;Cycle;Augustఈ పుతిన్‌ గూఢచారి రూటే సెపరేటు?ఈ పుతిన్‌ గూఢచారి రూటే సెపరేటు?putin{#}jeevitha rajaseskhar;Russia;Germany;AdiNarayanaReddy;Moscow;Parliment;Cycle;AugustTue, 06 Aug 2024 06:44:00 GMTఅది 2024 ఆగష్టు 1 మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే ల్యాండైన ఓ విమానం నుంచి ఎనిమిది మంది ప్రత్యేక భద్రతా అధికారులు బయటకు వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్ చేసుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు వీఐపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు.


ఐదేళ్ల క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్. చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ కార్యాలయానికి, పార్లమెంట్ కి కూత వేటు దూరంలో ఉన్న ఓ పార్కులో సైకిల్ పై వస్తున్న వ్యక్తి సడెన్ గా గన్ తీసి తన ముందు నడుస్తున్న మాజా చెచెన్ రెబల్ జెలీం ఖాన్ను కాల్చేశాడు. వెంటనే సైకిల్ ని పక్కనే పడేసి చుట్టుపక్కల వాళ్లు తేరుకునే లోపే మాయమైపోయాడు. అంతేకాదు గడ్డం తీసేసి , విగ్ పక్కన పడేసి తన రూపాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడు.  అయినా అతను దొరికిపోవడంతో పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. నాడు జర్మనీలో జీవిత ఖైదుకి గురైంది.. పుతిన్ నుంచి ఘన స్వాగతం లభించిన వ్యక్తి ఇద్దరూ ఒక్కరే. ఆయనే వదీం క్రషికోవ్. పేరు మోసిన రష్యా హిట్ మ్యాన్.


ఆయన జెలీంఖాన్ ఒక్కరినే కాదు. రష్యాకు కంట్లో నలుసులా మారిన వాళ్లేందరనో క్రషి కోవ్ వెంటాడి చంపాడు.  విదేశీ గడ్డపై ఇలా సైలెంట్ అసైన్ మెంట్లు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రష్యా గూఢాచార్యంలో అనతి కాలంలోనే హిట్ మ్యాన్ గా పేరొందాడు.


అందుకే పుతిన్ కి అత్యంత బాగా నచ్చాడు. ఇతడిని విడిపించుకుకోవడాన్ని పుతిన్ సవాల్ గా తీసుకున్నారు. తనకు సంబంధమే లేదని క్రషికోవ్ బుకాయించినా.. ఆది అతని పనేనని పుతిన్ అంగీకరించారు. ఇతని కకోసం సోవియట్ పతనం తర్వాత తొలిసారి అమెరికాతో చరిత్రలోనే తొలిసారి పెద్ద ఖైదీల మార్పిడికి అంగీకరించారు. వాల్ స్ర్టీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మొరైన్ వీలన్తో సహా 16 మందిని వదిలేశారు. బదులుగా అమెరికా, జర్మనీ, పశ్చిమ దేశాల నుంచి క్రషికోవ్ తో పాటు ఎనిమిది మంది రష్యన్లను విడిపించుకున్నారు. వీరిలో మరో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లున్నారు. మొత్తం మీద ఏజెంట్లకు తాము ఏం చేసినా పుతిన్ ఉన్నారనే ధైర్యాన్ని ఆయన కల్పించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>