MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-tree-falls-old-histery4420cae0-9c3b-42ca-9d50-1c76a7436b39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-tree-falls-old-histery4420cae0-9c3b-42ca-9d50-1c76a7436b39-415x250-IndiaHerald.jpgదాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి దర్శక నిర్మాతలు నటీనటులు సైతం కొన్ని ప్రాంతాలలో షూటింగులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా సినిమాలు ఒక చెట్టు కింద సినిమా షూటింగులు కూడా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ చెట్టు దాదాపుగా 150 ఏళ్ల వయసు ఉన్నది.. ఈ చెట్టే సిని మహావృక్షం అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా చెట్టు హిస్టరీ తెలిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరి సినిమా వాళ్లకు ఆ చెట్టుకు చాలా సెంటిమెంట్ ఉందట. ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం చాలా మంది దర్శక నిర్మాతలకు ఉండేదట. కొన్CINEMA TREE;FALLS;OLD;HISTERY{#}Ram Charan Teja;Cinema;East Godavari;media;Rangasthalam;Kovvurఅయ్యో: కూలిపోయిన సినిమా చెట్టు.. ఈ చెట్టు హిస్టరీ తెలిస్తే షాకే..!అయ్యో: కూలిపోయిన సినిమా చెట్టు.. ఈ చెట్టు హిస్టరీ తెలిస్తే షాకే..!CINEMA TREE;FALLS;OLD;HISTERY{#}Ram Charan Teja;Cinema;East Godavari;media;Rangasthalam;KovvurTue, 06 Aug 2024 07:00:00 GMTదాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి దర్శక నిర్మాతలు నటీనటులు సైతం కొన్ని ప్రాంతాలలో షూటింగులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా సినిమాలు ఒక చెట్టు కింద సినిమా షూటింగులు కూడా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ చెట్టు దాదాపుగా 150 ఏళ్ల వయసు ఉన్నది.. ఈ చెట్టే సిని మహావృక్షం అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా చెట్టు హిస్టరీ తెలిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరి సినిమా వాళ్లకు ఆ చెట్టుకు చాలా సెంటిమెంట్ ఉందట. ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం చాలా మంది దర్శక నిర్మాతలకు ఉండేదట.



కొన్ని వందల సినిమా షూటింగులు ఈ చెట్టు కింద ఎక్కువగా జరిగాయి. ఈ చెట్టు ఎక్కడో కాదు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో కుమార దేవం లో ఉన్నటువంటి చెట్టే.. నిన్నటి రోజున ఈ చెట్టు కూలిపోయినట్లుగా తెలుస్తోంది.. 1975 లో విడుదలైన పాడిపంటలు సినిమా నుంచి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా వరకు ఈ సినిమా చరిత్ర ఉన్నది. అలనాటి డైరెక్టర్లలో జంధ్యాల, కె.విశ్వనాథ్, వంశి తదితర డైరెక్టర్లకు ఈ చెట్టు మంచి ఫేవరెట్ స్పాట్ ఆట.


చాలా మంది ఈ సినిమా షూటింగ్ సమయాలలో ఆ చెట్టు కింద భోజనం చేసేవారు. ఈ సినిమా చెట్టు దగ్గర సుమారుగా 300 సినిమా షూటింగ్ లు జరగడం గమనార్హం. కుమారదేవం గ్రామానికి సైతం మంచి పేరు రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా చెట్టే.. ఈ చెట్టు తమ ఊరికి చాలా పేరు తెచ్చిందని అక్కడ ప్రజలు తెలియజేశారు. కానీ ఆ చెట్టు ఇప్పుడు కూలిపోవడం చాలా బాధ కలిగిస్తుంది అంటూ అక్కడి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>