MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘శాంతినివాసం’ సీరియల్ తీసే సమయంలో ఆ సీరియల్ కు దర్శకత్వం వహించిన రాజమౌళి పేరు కూడ చాలామందికి తెలియదు. అంతేకాదు ఆసమయంలో అతడికి నెలకు 2వేలు పారితోషికం ఇచ్చేవారు అని అంటారు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు 100 కోట్ల పారితోషికం తీసుకునే దర్శకుడుగా మారుతానని అప్పట్లో ఆయన కూడ అనుకుని ఉండరు. పాన్ ఇండియా దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న జక్కన్న కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా సందర్భం కుదిరితే నటించగలడు అన్నవిషయం ఈమధ్యనే విడుదలైన ‘కల్కి 2898’ రుజువు చేసింది. వాస్తవానికి రాజమౌళి చినrajamouli{#}Rajamouli;K V Vijayendra Prasad;Father;Darsakudu;Shakti;NET FLIX;India;Cinema;Director;Newsఅందరికీ షాక్ ఇచ్చి శ్రీకృష్ణుడుగా మారిన రాజమౌళి !అందరికీ షాక్ ఇచ్చి శ్రీకృష్ణుడుగా మారిన రాజమౌళి !rajamouli{#}Rajamouli;K V Vijayendra Prasad;Father;Darsakudu;Shakti;NET FLIX;India;Cinema;Director;NewsMon, 05 Aug 2024 08:00:00 GMT‘శాంతినివాసం’ సీరియల్ తీసే సమయంలో ఆ సీరియల్ కు దర్శకత్వం వహించిన రాజమౌళి పేరు కూడ చాలామందికి తెలియదు. అంతేకాదు ఆసమయంలో అతడికి నెలకు 2వేలు పారితోషికం ఇచ్చేవారు అని అంటారు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు 100 కోట్ల పారితోషికం తీసుకునే దర్శకుడుగా మారుతానని అప్పట్లో ఆయన కూడ అనుకుని ఉండరు.



పాన్ ఇండియా దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న జక్కన్న కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా సందర్భం కుదిరితే నటించగలడు అన్నవిషయం ఈమధ్యనే విడుదలైన ‘కల్కి 2898’ రుజువు చేసింది. వాస్తవానికి రాజమౌళి చిన్న వయసులోనే కృష్ణుడుగా పాత్రను పోషించిన సినిమా ఒకటి ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు.



ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ మూవీ విడుదలకాలేదు. ఈమూవీని విజయేంద్ర ప్రసాద్ కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా దాదాపు 30 సంవత్సరాల క్రితం కలిసి నిర్మించినట్లు తెలుస్తోంది. ఈమూవీ నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల కాలేదు. ఈసినిమాతో అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ తాను కష్టపడి సంపాదహించుకున్న చాల డబ్బులు పోగొట్టుకున్నాడు అని అంటారు. అయితే ఆమూవీ షూటింగ్ లో శ్రీకృష్ణుడుగా నటించిన రాజమౌళి అదృష్టం కలిసి రాకపోవడంతో అప్పట్లో వ్యాపార రంగంలో బాగా దెబ్బతిన్నారు అన్న వార్తలు కూడ ఉన్నాయి.



జక్కన్న కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ మీడియాకు విడుదల చేశారు. ఆ స్టీల్ లో రాజమౌళి చాల నాజూకుగా కనపడటమే కాకుండా శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్న రాజమౌళిని గుర్తించడం చాలామందికి కష్ట సాధ్యంగా మారింది. రాజమౌళి యుక్త వయస్సులో శ్రీకృష్ణుడు గా నటించిన ఆసినిమా పేరు ‘పిల్లన గ్రోవి’ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేస్తున్న మోడ్రన్ మాస్టర్స్ కార్యక్రమంలో రాజమౌళి చిన్ననాటి శ్రీకృష్ణుడి గెటప్ ఇప్పుడు బయటకు రావడంతో ఆ స్టీల్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>