MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mister-bachchan-double-ismart-movies66e4c92d-2c54-4c6b-9a62-587592520878-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mister-bachchan-double-ismart-movies66e4c92d-2c54-4c6b-9a62-587592520878-415x250-IndiaHerald.jpgఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోల మధ్య డైరెక్టర్లు మధ్య పోటీ అనేది కచ్చితంగా ఉండనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15 కి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ డైరెక్టర్ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి డైరెక్టర్ పూరి, రామ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్, మరొకటి డైరెక్టర్ హరి శంకర్ ,రవితేజ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్. ఈ రెండు చిత్రాలు ఆగస్టు 15న పోటీతో విడుదల కాబోతున్నాయి. అయితే వీటితోపాటు చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్, మరో చిన్న చిత్రం ఆయ్ విడుదల కాబోతున్నాయి. అలాగే మరో రెండు బాలీవుడ్ MISTER BACHCHAN;DOUBLE ISMART;MOVIES{#}naina;Smart phone;Saturday;Nani;Blockbuster hit;ismart shankar;vikram;shankar;Mister;Hindi;ram pothineni;bollywood;News;Chitram;Tollywood;Director;Telugu;Cinemaపాపం: ఈ రెండు చిత్రాలకు అదే సమస్య.. మార్చుకోలేరా..?పాపం: ఈ రెండు చిత్రాలకు అదే సమస్య.. మార్చుకోలేరా..?MISTER BACHCHAN;DOUBLE ISMART;MOVIES{#}naina;Smart phone;Saturday;Nani;Blockbuster hit;ismart shankar;vikram;shankar;Mister;Hindi;ram pothineni;bollywood;News;Chitram;Tollywood;Director;Telugu;CinemaMon, 05 Aug 2024 14:28:19 GMTఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోల మధ్య డైరెక్టర్లు మధ్య పోటీ అనేది కచ్చితంగా ఉండనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15 కి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ డైరెక్టర్ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి డైరెక్టర్ పూరి, రామ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్, మరొకటి డైరెక్టర్ హరి శంకర్ ,రవితేజ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్. ఈ రెండు చిత్రాలు ఆగస్టు 15న పోటీతో విడుదల కాబోతున్నాయి. అయితే వీటితోపాటు చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్, మరో చిన్న చిత్రం ఆయ్ విడుదల కాబోతున్నాయి. అలాగే మరో రెండు బాలీవుడ్ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయట.


అయితే స్టార్ హీరోలు చిత్రాలకు నైజాంలో సింగిల్ స్క్రీన్ లతో ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ రెండు మూడు థియేటర్లు ఉంటే చాలు చెరోకటి లభిస్తూ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ లోనే చాలా సమస్య ఏర్పడుతుందట. అన్ని చిత్రాలకు స్క్రీన్లు అడ్జస్ట్ చేయడం చాలా కష్టము. హిందీ సినిమాలకు కూడా ఐమాక్స్ పివిఆర్ లో కచ్చితంగా రెండు షోలు వేయాల్సిందే. అలా ఖచ్చితంగా హిందీ సినిమాలకే ఐదు ఆరు షోలు వెళ్లిపోతాయి. మిగిలిన షోలు కేవలం నాలుగింటిలో తెలుగు సినిమాలనే వేసుకోవాల్సి ఉంటుంది.


ఇక సినిమా విడుదలైన తర్వాత ఏ సినిమాకి ఎక్కువగా టాక్ బాగుంటుందో ఆ సినిమాకి స్క్రీన్లు వెళ్ళిపోతాయి. ఇదంతా బాగానే ఉన్న ఇక్కడే ఒక సమస్య ఉన్నదట. ధమాకా సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో నైజాంలో 13 కోట్ల పైగా సాధించింది. అయితే ఈ సినిమాకి ఆపోజిట్ గా పెద్దగా ఏ సినిమాలు కూడా లేవు.. కానీ ఇప్పుడు సోలోగా ఏ సినిమా విడుదల కాలేదు. పైగా రెండు వారాలలో నాని నటించిన సరిపోద శనివారం సినిమా కూడా విడుదల కాబోతోంది... డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా నైజం ఏరియాలో 15 కోట్ల వరకు సంపాదించేలా కనిపిస్తోంది. ఒకవేళ ఈ రెండు చిత్రాలకు పోటీ లేకుండా విడివిడిగా వచ్చి ఉంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లు కూడా ఎక్కువగా దొరికేది. వీటివల్లే ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి డైరెక్టర్లు సినిమాని ఎవరైనా పోస్ట్ ఫోన్ చేసుకుంటారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>