PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-pinnelli-filed-another-petition-in-the-high-court34800efd-b8be-4fc3-8b58-3e6657bc739c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-pinnelli-filed-another-petition-in-the-high-court34800efd-b8be-4fc3-8b58-3e6657bc739c-415x250-IndiaHerald.jpgరాజకీయాలలో ఓడలు బండ్లు కావడానికి బండ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదనే సంగతి తెలిసిందే. ఒక్క సార్వత్రిక ఎన్నిక ఫలితం పొలిటికల్ లెక్కల్ని మొత్తం మార్చేస్తుంది. రాజకీయ నేతలు ఎప్పుడూ ఆవేశంతో కంటే ఆలోచనతో పని చేస్తే మాత్రమే మంచి ఫలితాలను పొందవచ్చని చాలా సందర్బాల్లో ప్రూవ్ అయింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. pinnelli ramakrishna reddy{#}mandalam;court;Pinnelli Ramakrishna Reddy;June;Nellore;TDP;Arrest;policeఆవేశంతో పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసుకున్న పిన్నెల్లి.. రాంగ్ రూట్ లో వెళ్లారంటూ?ఆవేశంతో పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసుకున్న పిన్నెల్లి.. రాంగ్ రూట్ లో వెళ్లారంటూ?pinnelli ramakrishna reddy{#}mandalam;court;Pinnelli Ramakrishna Reddy;June;Nellore;TDP;Arrest;policeMon, 05 Aug 2024 09:20:00 GMTరాజకీయాలలో ఓడలు బండ్లు కావడానికి బండ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదనే సంగతి తెలిసిందే. ఒక్క సార్వత్రిక ఎన్నిక ఫలితం పొలిటికల్ లెక్కల్ని మొత్తం మార్చేస్తుంది. రాజకీయ నేతలు ఎప్పుడూ ఆవేశంతో కంటే ఆలోచనతో పని చేస్తే మాత్రమే మంచి ఫలితాలను పొందవచ్చని చాలా సందర్బాల్లో ప్రూవ్ అయింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
 
పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌పై దాడి చేయడం వల్ల పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలు కావడం పిన్నెల్లికి ఊహించని షాకిచ్చింది. అయితే పోలింగ్ కేంద్రంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే ఫిర్యాదు చేసి పిన్నెల్లి న్యాయం కోరి ఉంటే బాగుండేది.
 
ఆవేశంతో తప్పు దారిలో అడుగులు వేయడం వల్ల ప్రస్తుతం పిన్నెల్లి జైలులో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం, సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండటం సైతం పిన్నెల్లికి మైనస్ అయింది. ఏ షరతుకైనా అంగీకరిస్తానని తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది.
 
మొత్తం నాలుగు కేసులలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని భోగట్టా. జూన్ నెల 26వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దిగువ కోర్టులో రెండు సార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఎగువ కోర్టును ఆశ్రయించడం జరిగింది. పిన్నెల్లి అరెస్ట్ విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చ సైతం జరుగుతోంది. పిన్నెల్లి పొలిటికల్ కెరీర్ కూడా ఒక విధంగా ప్రమాదంలో పడినట్టేనని చెప్పవచ్చు. పిన్నెల్లి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>