PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/apf259c883-5880-499a-aaba-bb7a2c4aa6fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/apf259c883-5880-499a-aaba-bb7a2c4aa6fd-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార పార్టీ దూకుడుతో వైసీపీ సీనియర్ నేతలకు చిక్కులు వచ్చాయి. వదల బొమ్మాలి వదల అంటూ వరుసగా కేసులు వెంటాడుతుండటంతో నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న బాధ నుంచి తేరుకోక ముందే తాజాగా మాజీలపై కేసులు నమోదవడంతో వారి చుట్టూ వివాదాలు ముసరుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలతో పాటు కొత్తగా కూడా కొన్ని వివాదాలు వారిని చుట్టుముడుతున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ లో కోర్టుల చుట్టూ వైసీపీ నేతలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ap{#}Nani;hemanth;vamsi;Nellore;Vishakapatnam;gannavaram;Traffic police;Madanapalle;MP;police;Police Station;Minister;MLA;Government;Jagan;Party;YCPకూటమి సర్కార్...నరకం అనుభవిస్తున్న వైసీపీ నేతలు ?కూటమి సర్కార్...నరకం అనుభవిస్తున్న వైసీపీ నేతలు ?ap{#}Nani;hemanth;vamsi;Nellore;Vishakapatnam;gannavaram;Traffic police;Madanapalle;MP;police;Police Station;Minister;MLA;Government;Jagan;Party;YCPMon, 05 Aug 2024 08:02:00 GMTఏపీలో అధికార పార్టీ దూకుడుతో వైసీపీ సీనియర్ నేతలకు చిక్కులు వచ్చాయి. వదల బొమ్మాలి వదల అంటూ వరుసగా కేసులు వెంటాడుతుండటంతో నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న బాధ నుంచి తేరుకోక ముందే తాజాగా మాజీలపై కేసులు నమోదవడంతో వారి చుట్టూ వివాదాలు ముసరుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలతో పాటు కొత్తగా కూడా కొన్ని వివాదాలు వారిని చుట్టుముడుతున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ లో కోర్టుల చుట్టూ వైసీపీ నేతలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇప్పటివరకు వైసీపీకి చెందిన 50 మంది కీలకనేతలపైన పోలీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నేతలు ఆచూకీ లేకుండా అదృశ్యం అయిపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూకుడుగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చును. అప్పట్లో విమర్శలు, ఆరోపణలు, వివాదాలు వివాదాలకు కారణమైన వైసీపీ నేతలపై విచారణకు ఆదేశించింది. ఇక గత సర్కారులో మంత్రిగా పనిచేసి జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు చుట్టుముట్టుకుంది.


నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలో ఫైల్స్ దగ్ధం అయ్యాయని పెద్దిరెడ్డి వెనుక ఉండి కథ నడిపించారంటూ ఆయన అనుచరులపైన ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పలువురు నేతల్లో ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక మాజీ మంత్రి కోడాలి నానిపై కూడా కేసు నమోదయ్యాయి. లిక్కర్ గోదామ్ లీజ్ వ్యవహారంలో బెదిరించారంటూ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. దీంతో నాని కోర్టును ఆశ్రయించారు.


ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని A-71గా చేర్చారు. అయితే ప్రస్తుతం వంశీ కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత సత్యనారాయణపై కూడా వచ్చిన కిడ్నాప్ వివాదం కేసు మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో ఎంవివి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులను డిమాండ్ చేశారని హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పటి హత్యయత్నం కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ ను విచారించి ప్రస్తుతం కేసును రీఓపెన్ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>