PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp4b05e76c-0bc7-4201-83fb-a057bab393ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp4b05e76c-0bc7-4201-83fb-a057bab393ca-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ప్రస్తుతం ఏపీలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ycp{#}BOTCHA SATYANARAYANA;Fort;Vishakapatnam;Elections;Assembly;Telugu Desam Party;Jagan;Katthi;local language;CBN;YCP;TDP;News;Reddyవైసీపీని తట్టుకోవడం టీడీపీ వల్ల కావడం లేదా...నేతలు భయపడుతున్నారా?వైసీపీని తట్టుకోవడం టీడీపీ వల్ల కావడం లేదా...నేతలు భయపడుతున్నారా?ycp{#}BOTCHA SATYANARAYANA;Fort;Vishakapatnam;Elections;Assembly;Telugu Desam Party;Jagan;Katthi;local language;CBN;YCP;TDP;News;ReddyMon, 05 Aug 2024 10:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ప్రస్తుతం ఏపీలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.


అయితే ఓటమి బాధలో ఉన్న వైసిపి పార్టీ... ఈ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలిస్తే మళ్ళీ ఒక ఊపు వస్తుంది. అందుకే ఈ ఉప ఎన్నిక తెలుగుదేశం కూటమి కంటే వైసీపీకి చాలా కీలకంగా మారింది. ఇందులో భాగంగానే ఇప్పటికే అభ్యర్థిని కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.


విశాఖ ఎమ్మెల్సీ సీటుకు వైసీపీ అధిష్టానం... బొత్స సత్యనారాయణ పేరును ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. మన ఎన్నికల్లో బొత్స కుటుంబం దారుణంగా ఓడిపోయింది. అయితే అనూహ్యంగా మళ్ళీ... బొత్స సత్యనారాయణ కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది సరికొత్త వ్యూహం అని కొంతమంది అంటున్నారు.  అయితే కూటమి ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన కత్తి మీద సాములాగా తయారైందని అంటున్నారు.


వైసిపి నుంచి ఇటీవల టిడిపిలోకి వచ్చిన నేతల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని టిడిపి అనుకుంటున్నాట్లు సమాచారం అందుతోంది. వాళ్లే కాకుండా చాలా మంది నేతలు ఈ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దగ్గర మొరపెట్టుకుంటున్నారట. టికెట్ ఇవ్వడంలో... చంద్రబాబు  నాయుడు టీం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందట. ఎవరో ఒకరికి ఇవ్వడం వల్ల.. ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థి ఓడి పోతే... వైసిపి గెలుపును తట్టుకోవడం కష్టమని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారట చంద్రబాబు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>