Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcdc59caf-67a5-4ba6-9b86-109334229eea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcdc59caf-67a5-4ba6-9b86-109334229eea-415x250-IndiaHerald.jpgపూరి జగన్నాథ్.. ఇప్పుడంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన పేరు అంతగా వినిపించట్లేదు. కానీ ఒకప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ అంటే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ప్రస్తుతం మనం ఇండస్ట్రీలో మాట్లాడుకునే ఎంతోమంది స్టార్ హీరోలను మాస్ హీరోలను చేసింది పూరి జగన్నాథ్ సినిమాలే. ఇక ఫ్లాప్ లలో కొనసాగుతున్న ఎంతోమంది హీరోలకు సాలిడ్ హిట్లు ఇచ్చింది కూడా పూరి జగన్నాథ్ సినిమాలే. స్పీడ్ గా స్క్రిప్ట్ రాసుకోవడమే కాదు అంతే స్పీడ్ గా సినిమాలను తీసి మూడు నెలల వ్యవధిలోనే సినిమాలను తెరకేక్కRam{#}ismart shankar;Kick;puri jagannadh;Mass;Hero;Manam;Tollywood;ram pothineni;Success;Industry;Director;Cinema;Eventడైరెక్టర్ పూరి గురించి.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన రామ్?డైరెక్టర్ పూరి గురించి.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన రామ్?Ram{#}ismart shankar;Kick;puri jagannadh;Mass;Hero;Manam;Tollywood;ram pothineni;Success;Industry;Director;Cinema;EventMon, 05 Aug 2024 11:00:00 GMTపూరి జగన్నాథ్.. ఇప్పుడంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన పేరు అంతగా వినిపించట్లేదు. కానీ ఒకప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ అంటే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమాలకు కేరాఫ్  అడ్రస్ గా ఉండేవాడు. ప్రస్తుతం మనం ఇండస్ట్రీలో మాట్లాడుకునే ఎంతోమంది స్టార్ హీరోలను మాస్ హీరోలను చేసింది పూరి జగన్నాథ్ సినిమాలే. ఇక ఫ్లాప్ లలో కొనసాగుతున్న ఎంతోమంది హీరోలకు సాలిడ్ హిట్లు ఇచ్చింది కూడా పూరి జగన్నాథ్ సినిమాలే.


 స్పీడ్ గా స్క్రిప్ట్ రాసుకోవడమే కాదు అంతే స్పీడ్ గా సినిమాలను తీసి మూడు నెలల వ్యవధిలోనే సినిమాలను తెరకేక్కించి విడుదల చేసే ఘనత కూడా అటు పూరికే దక్కింది అని చెప్పాలి. ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలను తీసిన పూరి గత కొంతకాలం నుంచి మాత్రం పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నాడు. భిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎందుకో పూరి సినిమాలు ఒకప్పటిలా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయితే లైగర్ అనే సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసి బాగా నష్టపోయిన పూరి.. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.


 ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాని చెప్పుకొచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను మించి ఉండాలి అనే ఉద్దేశంతో డబుల్ ఇస్మార్ట్ స్టోరీ పూరి రాశాడు అంటూ రామ్ చెప్పుకొచ్చాడు. పూరి ఎక్కువ సమయం తీసుకున్న స్క్రిప్ట్ ఇదే అంటూ తెలిపాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూరితో పనిచేసేటప్పుడే కాకుండా అతని స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా కిక్ వస్తుంది అంటూ రామ్ కామెంట్ చేశాడు. కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం అంత సులువు కాదని పేర్కొన్నాడు రామ్. కాగా ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>