PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-govt-employees-happy-in-cbns-eraafb9d7db-b90d-44de-8ee4-fdf91ff29275-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-govt-employees-happy-in-cbns-eraafb9d7db-b90d-44de-8ee4-fdf91ff29275-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన కూడా ఉపాధ్యాయుల సమస్యలు తీరడం లేదని ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం పైన... ఏపీ టీచర్లు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగంగానే చంద్రబాబు కూటమి సర్కారు పై విమర్శలు చేస్తున్నారు ఏపీ టీచర్లు. తాజాగా దీనికి సంబంధించిన వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. chandrababu{#}WhatsApp;Telugu Desam Party;CBN;Government;Andhra Pradesh;Reddy;sunday;Newsచంద్రబాబు సర్కార్‌ పై టీచర్ల తిరుగుబాటు?చంద్రబాబు సర్కార్‌ పై టీచర్ల తిరుగుబాటు?chandrababu{#}WhatsApp;Telugu Desam Party;CBN;Government;Andhra Pradesh;Reddy;sunday;NewsMon, 05 Aug 2024 13:17:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన కూడా ఉపాధ్యాయుల సమస్యలు తీరడం లేదని ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం పైన... ఏపీ టీచర్లు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగంగానే చంద్రబాబు కూటమి సర్కారు పై విమర్శలు చేస్తున్నారు ఏపీ టీచర్లు. తాజాగా దీనికి సంబంధించిన వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీచర్లు చాలా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోతే తమకు న్యాయం జరుగుతుందని టీచర్లు భావించి... కూటమి ప్రభుత్వ విజయానికి చాలా కృషి చేశారు టీచర్లు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన కూడా ఏపీ టీచర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని ఇప్పుడు.. ప్రచారం జరుగుతోంది.

 ఆగస్టు 4వ తేదీ అంటే ఆదివారం రోజున.. టీచర్లకు సెలవు దినం ఇవ్వలేదు. వర్కింగ్ డే గా ప్రకటించింది  చంద్రబాబు ప్రభుత్వం.దీంతో.. ఏపీ టీచర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగే.. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అయితే మీడియం ముందుకు వచ్చి చెప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో.. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆదివారం రోజున ఉన్నఫలంగా హాలిడే కాకుండా.. వర్కింగ్ డే పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీచర్లు.

సెలవు రోజున వర్కింగ్ డే పెట్టి మానసికంగా వేధిస్తున్నారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే 117 జీవో పైన కూ డా ఏపీ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీల్లో తెలుగుదేశం కూటమి 117 జీవోను కొట్టివేస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని సర్దుబాటు చేస్తోంది. కానీ జీవో ను మాత్రం రద్దు చేయడం లేదు. దీనిపైన కూడా ప్రభుత్వ టీచర్లు మండిపడుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>