PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/budhha-venkana-tdp-bjp-sujana-chowdari7b909248-4103-46d8-9675-f15628e3c780-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/budhha-venkana-tdp-bjp-sujana-chowdari7b909248-4103-46d8-9675-f15628e3c780-415x250-IndiaHerald.jpgటిడిపి సీనియర్ నాయకుడుగా , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఇప్పుడు మరొకసారి తన పార్టీలో అసంతృప్తిని సైతం బయటకి చెప్పడం జరిగింది. గతంలో విజయవాడ వెస్ట్ సీట్ ని ఆయన ఆశించినప్పటికీ అయితే ఆ సీటును బిజెపి సీనియర్ నేత సుజనా చౌదరికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దీంతో సుజనా తనకి నచ్చిన ప్రకారం ఉద్యోగులను నియమించుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వెళ్లడం ఈ విషయాన్ని ఎమ్మెల్యే అసలు జీర్ణించుకోలేకపోతున్నారట. తన మనసులో ఉన్న బాధను అన్నిటినీ సైతం ఇటీవలే విజయవాడ ఎంపీ కేసినేనిBUDHHA VENKANA;TDP;BJP;SUJANA CHOWDARI{#}Vijayawada;Sri Venkateswara swamy;Sujana Choudary;Bharatiya Janata Party;MLA;Yevaru;CBN;YCP;TDPఏపీ: ఆ టిడిపి నేత పరిస్థితి అలా తయారయ్యిందా.. న్యాయం జరగలేదంటూ..?ఏపీ: ఆ టిడిపి నేత పరిస్థితి అలా తయారయ్యిందా.. న్యాయం జరగలేదంటూ..?BUDHHA VENKANA;TDP;BJP;SUJANA CHOWDARI{#}Vijayawada;Sri Venkateswara swamy;Sujana Choudary;Bharatiya Janata Party;MLA;Yevaru;CBN;YCP;TDPSun, 04 Aug 2024 07:49:00 GMTటిడిపి సీనియర్ నాయకుడుగా , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఇప్పుడు మరొకసారి తన పార్టీలో అసంతృప్తిని సైతం బయటకి చెప్పడం జరిగింది. గతంలో విజయవాడ వెస్ట్ సీట్ ని ఆయన ఆశించినప్పటికీ అయితే ఆ సీటును బిజెపి సీనియర్ నేత సుజనా చౌదరికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దీంతో సుజనా తనకి నచ్చిన ప్రకారం ఉద్యోగులను నియమించుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వెళ్లడం ఈ విషయాన్ని ఎమ్మెల్యే అసలు జీర్ణించుకోలేకపోతున్నారట.


తన మనసులో ఉన్న బాధను అన్నిటినీ సైతం ఇటీవలే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తనకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ తెలియజేశారు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు నేతలు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గతంలో వైసిపి హయాంలో టిడిపి కోసం ఏకంగా 37 కేసులు తన మీద పెట్టించుకున్నట్లుగా కూడా తెలియజేశారు. ఎమ్మెల్యే పదవి ఉంటేనే మాట చెల్లుబాటు అవుతుందని విషయం ఈ ఎన్నికలలో తాను గుర్తుంచుకున్నానని తెలియజేశారు.


పదవి లేకపోతే నమ్ముకున్న వారికి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ఆయన ఆవేదనను తెలియజేశారు.ఎమ్మెల్యేలు తమకు ఇష్టమైన వారికి సీఐలుగా నియమించుకుంటున్నారని తన మాట ఎవరు వినడం లేదని తానే ఇతరుల పైన ఆధారపడవలసి వస్తోంది అంటూ తెలిపారు. ఈ పరిస్థితులలో తనని నమ్ముకున్న వారికి ఏం చేయాలని ప్రశ్నించడం జరిగింది బుద్ధ వెంకన్న.. తను నమ్మిన వారికి ఏం చేయలేకపోయాను క్షమించండి అంటూ ఈ వేదికగా తెలియజేశారు. గతంలో చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అంటూ తెలియజేశారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అడ్డు వచ్చారు చెప్పాలి అంటూ ఆయన తెలిపారు. దీంతో ఈయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అంటూ మరి కొంతమంది నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు ..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>