MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb3291458-f338-426a-966f-b1044639e035-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb3291458-f338-426a-966f-b1044639e035-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి త‌న‌దైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల మ‌నసుల్ని గెలుచుకున్నాడు. ఇక నవీన్ పొలిశెట్టి అనే పేరు ఇప్పుడు తెలుగు సినీ ప్రేమికులందరికీ సుపరిచితం. తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ నటుడు తాజాగా మరో అవార్డును గెలుచుకోవడం ద్వారా తన ప్రతిభకు మరోసారి నిదర్శనంగా నిలిచాడు. తాజాగా ఆయ‌న ట్యాలెంట్ కు ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా వ‌చ్చింది. ఆయ‌న న‌టించిన ”మిస్ట‌ర్ అండ్ మిస్ పొలిశెట్టి” సినిమాలోని ఆయ‌న న‌ట‌న‌కు గాను బెస్ట్ యాక్ట‌ర్ (క్రిటిక్స్) అవార్డు tollywood{#}naveen polishetty;Comedy;Yuva;Telugu;Cinema;Heroనవీన్ పొలిశెట్టి: తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన స్టార్!నవీన్ పొలిశెట్టి: తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన స్టార్!tollywood{#}naveen polishetty;Comedy;Yuva;Telugu;Cinema;HeroSun, 04 Aug 2024 17:35:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి త‌న‌దైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల మ‌నసుల్ని గెలుచుకున్నాడు. ఇక నవీన్ పొలిశెట్టి అనే పేరు ఇప్పుడు తెలుగు సినీ ప్రేమికులందరికీ సుపరిచితం. తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ నటుడు  తాజాగా మరో అవార్డును గెలుచుకోవడం ద్వారా తన ప్రతిభకు మరోసారి నిదర్శనంగా నిలిచాడు. తాజాగా ఆయ‌న ట్యాలెంట్ కు ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా వ‌చ్చింది. ఆయ‌న న‌టించిన ”మిస్ట‌ర్ అండ్ మిస్ పొలిశెట్టి” సినిమాలోని ఆయ‌న న‌ట‌న‌కు గాను బెస్ట్ యాక్ట‌ర్ (క్రిటిక్స్) అవార్డు అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ అవార్డును గెలుచుకోవడంపై నవీన్ పొలిశెట్టి

 తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. ఈ అవార్డు తనకు ప్రేరణగా ఉంటుందని. భవిష్యత్తులో మరింత మంచి పాత్రలను ఎంచుకోవడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.  ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలోకి కామెడియన్‌గా అడుగుపెట్టిన నవీన్ పొలిశెట్టి, తన నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీ టైమింగ్, భావోద్వేగాలను తెరపై ప్రతిబింబించించే తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా కదిలించేలా చేస్తుంది. ఇకపోతే నవీన్ పొలిశెట్టి అవార్డు గెలుచుకోవడంతో సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

అభిమానులు, సినీ ప్రముఖులు, సహనటులు తమ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్   చేస్తున్నారు. ఈ అవార్డు తర్వాత నవీన్ పొలిశెట్టి భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ యంగ్ హీరో తన భవిష్యత్తు గురించి ఆశావహంగా ఉన్నారు. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే తపనతో ఉన్నారు. త్వరలోనే ఆయన నటించిన కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో.. అమెరికాలో ఉండగా నవీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొలుత అది చిన్న గాయం అనుకున్నారు. కానీ వైద్యులు స్కానింగ్ చేయగా చేతి విరిగినట్లు బైటపడింది. ప్రస్తుతం ఆయనకు కుడిచేయ్యికి వైద్యులు సిమెంట్ పట్టీ వేశారు. ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టి ఒక ఫన్నీ వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>