PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dharmavaram-assembly-constituency-bjp-satya-kumar-love-triveni7367728b-ae89-4a02-8eba-f398582cca13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dharmavaram-assembly-constituency-bjp-satya-kumar-love-triveni7367728b-ae89-4a02-8eba-f398582cca13-415x250-IndiaHerald.jpg•కులాంతర వివాహం •సత్య కుమార్ ప్రేమ పెళ్లికి సాక్ష్యం వెంకయ్య నాయుడే •భర్త గెలుపు కోసం త్రివేణి కష్టం.. (ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ) ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవులు కూడా చేపట్టారు. ముఖ్యంగా టిడిపి జనసేన పార్టీలకు చెందిన వారితో చంద్రబాబు కేబినెట్ మొత్తం నిండిపోయిdharmavaram ;assembly constituency bjp; satya kumar ;love ;triveni{#}satya;Ananthapuram;School;mandalam;nagarkurnool;Dharmavaram;venkaiah naidu;Kumaar;jeevitha rajaseskhar;Degree;kalyan;Wife;Telugu Desam Party;kadapa;Janasena;TDP;CBN;Girl;Husband;Andhra Pradesh;India;Ministerసత్య కుమార్ యాదవ్.. రాజకీయంలోనే కాదు ప్రేమలో కూడా గెలుపే..!సత్య కుమార్ యాదవ్.. రాజకీయంలోనే కాదు ప్రేమలో కూడా గెలుపే..!dharmavaram ;assembly constituency bjp; satya kumar ;love ;triveni{#}satya;Ananthapuram;School;mandalam;nagarkurnool;Dharmavaram;venkaiah naidu;Kumaar;jeevitha rajaseskhar;Degree;kalyan;Wife;Telugu Desam Party;kadapa;Janasena;TDP;CBN;Girl;Husband;Andhra Pradesh;India;MinisterSun, 04 Aug 2024 10:16:59 GMT•కులాంతర వివాహం

•సత్య కుమార్ ప్రేమ పెళ్లికి సాక్ష్యం వెంకయ్య నాయుడే

•భర్త గెలుపు కోసం త్రివేణి కష్టం..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా,  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవులు కూడా చేపట్టారు. ముఖ్యంగా టిడిపి జనసేన పార్టీలకు చెందిన వారితో చంద్రబాబు కేబినెట్ మొత్తం నిండిపోయింది. ఇక బిజెపికి కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి దక్కింది.. ఆయన ఎవరో కాదు ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్.

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో సత్య కుమార్ యాదవ్ జన్మించారు. పాఠశాల విద్య  కడప జిల్లా ప్రొద్దుటూరు, తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో సాగింది. ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత మధురై కామరాజు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ , చెన్నైలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. ఇంగ్లీష్,  మరాఠీ భాషలపై పట్టు ఉన్న ఈయన మాజీ ఉపరాష్ట్రపతి బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు కి దగ్గరయ్యారు.  1993లో వెంకయ్య నాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు సత్యకుమార్. ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే వెంకయ్య నాయుడుకి అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు కూడా. అందుకే ఈయన వెంకయ్య నాయుడు వర్గంలో ఒక అమ్మాయి త్రివేణిని ఇష్టపడడంతో కులాంతర వివాహాన్ని దగ్గరుండి మరి జరిపించారు.

అంతేకాదు మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తన భర్తను గెలిపించుకోవడం కోసం త్రివేణి ధర్మవరంలోని గడపగడపకు వెళ్లి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరుకుంది . తన భర్త విజయం కోసం ఆమె ఎంతలా పాటుపడిందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు ఆమె కష్టం ఫలించి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.  అసలు అక్కడ కేతిరెడ్డి తప్ప ఇంకెవరు గెలవలేరు అన్న సందర్భంలో ఎంతో పోరాటం చేసి సత్య కుమార్ గెలిచారు అంటే ఆయన గెలుపు వెనుక భార్య త్రివేణి ఎంతలా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఇద్దరి ప్రేమకు,  పెళ్లికి వెంకయ్య నాయుడు సాక్ష్యం అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>