PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/flight-ticket-236c3177-032c-482f-90e6-2176b8ad74eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/flight-ticket-236c3177-032c-482f-90e6-2176b8ad74eb-415x250-IndiaHerald.jpgత్వరలోనే భారతదేశ ప్రజలు 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా సంస్థ ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో విమాన టిక్కెట్ల ధరలు జస్ట్ రూ.1,947 నుంచే ప్రారంభమవుతాయి. ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్ పేరిట ఎన్నడూ లేని విధంగా ఈ విమానాల టిక్కెట్ల ధరలు తగ్గించింది. ఈ ధరలతో టికెట్లను ఆగస్టు 5 వరకు బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్న టికెట్లతో సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-గోవా, ఢిల్లీ-గ్వాలియర్ లాంటి ప్రముఖ ప్రదేశాలకు చాలాFlight ticket {#}Air India;INTERNATIONAL;septemberచరిత్రలో ఎన్నడూ లేని విధంగా చీప్ రేటుకు ఫ్లైట్ టికెట్.. ఎంతో తెలిస్తే..??చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చీప్ రేటుకు ఫ్లైట్ టికెట్.. ఎంతో తెలిస్తే..??Flight ticket {#}Air India;INTERNATIONAL;septemberSun, 04 Aug 2024 15:53:00 GMTత్వరలోనే భారతదేశ ప్రజలు 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా సంస్థ ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో విమాన టిక్కెట్ల ధరలు జస్ట్ రూ.1,947 నుంచే ప్రారంభమవుతాయి. ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్ పేరిట ఎన్నడూ లేని విధంగా ఈ విమానాల టిక్కెట్ల ధరలు తగ్గించింది. ఈ ధరలతో టికెట్లను ఆగస్టు 5 వరకు బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్న టికెట్లతో సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-గోవా, ఢిల్లీ-గ్వాలియర్ లాంటి ప్రముఖ ప్రదేశాలకు చాలా చోట్లకు తక్కువ ధరకే వెళ్లొచ్చు.

ఈ ఎయిర్‌లైన్ 15 అంతర్జాతీయ, 32 దేశీయ గమ్యస్థానాలకు తగ్గింపులు అందిస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ‘ఎక్స్‌ప్రెస్ లైట్’ అనే ప్రత్యేక ఆఫర్ ఉంది. ఈ ఆఫర్‌లో బ్యాగేజీ ఛార్జీలు చెల్లించకుండా ప్రయాణించవచ్చు. అంటే, చేతిలో తీసుకెళ్లే చిన్న సామాను తప్ప, పెద్ద సూట్‌కేసులు తీసుకెళ్లడానికి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. airindiaexpress.com వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.

అంతేకాకుండా, ఈ ఆఫర్‌లో అదనంగా 3 కిలోల బరువు ఉండే హ్యాండ్ లగేజ్ ని తీసుకెళ్లడానికి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. పెద్ద సూట్‌కేసు తీసుకెళ్లాలనుకుంటే, దేశీయ విమానాలలో 15 కిలోల బరువు ఉన్న సూట్‌కేసుకు రూ.1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోల బరువు ఉన్న సూట్‌కేసుకు రూ.1300 చెల్లించాలి. ఇది సాధారణ ధర కంటే తక్కువ.

ఈ ఎయిర్‌లైన్‌ను ఎక్కువగా వాడుతుంటే, లాయల్టీ మెంబర్‌గా కూడా చేరవచ్చు. తద్వారా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 8% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. బిజినెస్ క్లాస్, ప్రీమియం సీట్లు, హాట్ మీల్స్, పానీయాలు, అదనపు సౌకర్యాలపై కూడా తగ్గింపులు లభిస్తాయి. కేవలం లాయల్టీ మెంబర్లకే కాదు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, చిన్న వ్యాపారాలు, డాక్టర్లు, నర్సులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>