PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ntr37f0373f-cd37-4a84-abf1-45e298851b77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ntr37f0373f-cd37-4a84-abf1-45e298851b77-415x250-IndiaHerald.jpgసీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో సృష్టించిన సంచలనాలు, ఆయన అమలు చేసిన పథకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ మనిషి రూపంలో పుట్టిన దైవం అని చాలామంది భావిస్తారు. అయితే అలాంటి సీనియర్ ఎన్టీఆర్ సైతం ఒకానొక సమయంలో ఎన్నికల్లో ఓటమిపాలు కావడం ద్వారా వార్తల్లో నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఓడించి అప్పట్లో చిత్తరంజన్ దాస్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు. ntr{#}Hindupuram;NTR;history;Congress;Electionsఎన్టీఆర్ ను ఓడించి అప్పట్లో చరిత్ర సృష్టించిన చిత్తరంజన్ దాస్.. అలా గెలుపు సాధ్యమైందా?ఎన్టీఆర్ ను ఓడించి అప్పట్లో చరిత్ర సృష్టించిన చిత్తరంజన్ దాస్.. అలా గెలుపు సాధ్యమైందా?ntr{#}Hindupuram;NTR;history;Congress;ElectionsSat, 03 Aug 2024 09:20:00 GMTసీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో సృష్టించిన సంచలనాలు, ఆయన అమలు చేసిన పథకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ మనిషి రూపంలో పుట్టిన దైవం అని చాలామంది భావిస్తారు. అయితే అలాంటి సీనియర్ ఎన్టీఆర్ సైతం ఒకానొక సమయంలో ఎన్నికల్లో ఓటమిపాలు కావడం ద్వారా వార్తల్లో నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఓడించి అప్పట్లో చిత్తరంజన్ దాస్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు.
 
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఘోర పరాజయం పొలిటికల్ వర్గాల్లో ఒక విధంగా సంచలనం అయిందనే చెప్పాలి. చిత్తరంజన్ దాస్ పూర్తి పేరు జక్కుల చిత్తరంజన్ దాస్ కాగా సీనియర్ ఎన్టీఆర్ నా చేతిలో ఎన్నికల్లో ఓటమిపాలైనా నా నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఆయన అస్సలు అడ్డు పడలేదని చిత్తరంజన్ దాస్ చెప్పారంటే సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి సులువుగానే అర్థమవుతుందని చెప్పవచ్చు.
 
1989 ఎన్నికల సమయంలో ఆంధ్రాలో హిందూపురం నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ తెలంగాణలో కల్వకుర్తి నుంచి పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. 1985 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మధ్యంతర ఎన్నికలు రాగా అప్పట్లో చిత్తరంజన్ దాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అందువల్ల 1989లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆయనకే టికెట్ ఇవ్వగా ఆయన ఒకింత సులువుగానే ఎన్నికల్లో విజయం సాధించారు.
 
సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నా నేను కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకు ఉండేదని ఆ నమ్మకమే చివరకు నిజమైందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపించిందని ఆయన అన్నారు. ఆ ఎన్నికల్లో చిత్తరంజన్ దాస్ 3568 ఓట్ల మెజారిటీతో ఎన్టీఆర్ పై గెలవడం సాధ్యమైంది. తన గెలుపుతో అప్పట్లో చిత్తరంజన్ దాస్ ఒక విధంగా చరిత్ర సృష్టించారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>