PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbnd5d8995f-ca8b-4a13-86e8-584692cb31a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbnd5d8995f-ca8b-4a13-86e8-584692cb31a5-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి టోల్ వసూలు చేసేందుకు ముమ్మర కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లను బాగు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా.. గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలపై అన్వేcbn{#}vehicles;YCP;Andhra Pradesh;Governmentచంద్రబాబు కొత్త ప్లాన్‌.. అమలైతే జనం గగ్గోలే?చంద్రబాబు కొత్త ప్లాన్‌.. అమలైతే జనం గగ్గోలే?cbn{#}vehicles;YCP;Andhra Pradesh;GovernmentSat, 03 Aug 2024 06:54:00 GMTఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి టోల్ వసూలు చేసేందుకు ముమ్మర కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లను బాగు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.


ఈ మేరకు తమ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా.. గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలపై అన్వేషణ మొదలు పెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, సూపర్ సిక్స్ హామీలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడంతో ఏం చేయాలో అర్థం కాక కూటమి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయాల్లో అవకాశం ఉన్న ప్రతిదానిపై డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.


గత పదేళ్ల వైసీపీ పాలనలో రహదారులు గోతుల మయంగా మారడం, వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం వంటి కారణాలతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి రేగింది. సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినా మౌలిక వసతుల కల్పనలో మాత్రం విఫలం అయింది. ఈ తరుణలంలో అధికారంలోకి వచ్చిన కూటమి రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణాలకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఇది వరకు జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా వర్తింపజేయనుంది. తద్వారా సామాన్య ప్రజలపై టోల్ భారం పడనుంది. ఇందులో ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు తదితర వాహనాలు ఉండనున్నాయి. వీటన్నింటి నుంచి ఇప్పుడు టోల్ వసూలు చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టోల్ భారం మోయలేకపోతున్న వారికి ఇది మరో గుదిబండగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకపోయినా దీనిని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>