Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlice1df1ad-5a76-40ba-9dec-93ae19f3cc8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlice1df1ad-5a76-40ba-9dec-93ae19f3cc8a-415x250-IndiaHerald.jpgక్రికెట్ దేవుడిగా పేరు సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే టీమిండియా కు సేవలు అందించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ ఆటగాడికి సాధ్యం కానీ ఎన్నో అద్భుతమైన రికార్డులు కూడా నెలకొల్పాడు. ఇక నేటి తరం స్టార్ ప్లేయర్లలో ఎవరు కూడా సచిన్ రికార్డులకు చేరువలో లేరు. ఇక సచిన్ రికార్డులను అంతో ఇంతో చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందు స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ సచిన్ సాధించిన వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టాలని టార్గెట్ పెట్టKohli{#}Audi;VIRAT KOHLI;World Cup;Sachin Tendulkar;Yevaru;INTERNATIONAL;Cricket100 సెంచరీలు.. సచిన్ సాధించిన ఈ రికార్డులు మాత్రం కోహ్లీ ఎప్పటికీ బ్రేక్ చేయలేడు?100 సెంచరీలు.. సచిన్ సాధించిన ఈ రికార్డులు మాత్రం కోహ్లీ ఎప్పటికీ బ్రేక్ చేయలేడు?Kohli{#}Audi;VIRAT KOHLI;World Cup;Sachin Tendulkar;Yevaru;INTERNATIONAL;CricketSat, 03 Aug 2024 15:30:00 GMTక్రికెట్ దేవుడిగా పేరు సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే టీమిండియా కు సేవలు అందించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ ఆటగాడికి సాధ్యం కానీ ఎన్నో అద్భుతమైన రికార్డులు కూడా నెలకొల్పాడు. ఇక నేటి తరం స్టార్ ప్లేయర్లలో ఎవరు కూడా సచిన్ రికార్డులకు చేరువలో లేరు. ఇక సచిన్ రికార్డులను అంతో ఇంతో చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందు స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ సచిన్ సాధించిన వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కాగా కోహ్లీ ఇలా వంద సెంచరీల రికార్డు సాధించిన సచిన్ సాధించిన ఐదు రికార్డులను మాత్రం బద్దలు కొట్టడం కష్టమే అన్నది తెలుస్తుంది.


 టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా సచిన్ కొనసాగుతున్నాడు. ఏకంగా 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ ఎంత ప్రయత్నించినా బద్దలు కొట్టడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ 113 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే ఇప్పటికే కెరియర్ ముగింపులో ఉన్న కోహ్లీ ఇంకా చాలా ఏళ్ళు క్రికెట్ ఆడాలి.


 టెస్టుల్లో సచిన్ 15,971 పరుగులు చేశాడు ఇదే అత్యధికం. అయితే కోహ్లీ రికార్డుకు చేరువలో కూడా లేడు. ఇప్పటివరకు కోహ్లీ 8873 పరుగులు మాత్రమే చేశాడు.


 సచిన్ టెండూల్కర్ 22 ఏళ్ల 91 రోజులు పాటు వన్డే ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. కానీ కోహ్లీకి ఇది సాధ్యం కాదు. కోహ్లీకి ఇప్పటివరకు 15 ఏళ్ళ 913 రోజులు పూర్తయ్యాయి. కేరియర్ చివరి దశలో ఉన్న కోహ్లీకి ఇక సచిన్ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదు. కాగా సచిన్ కెరియర్ మొత్తంలో ఆరు వండే వరల్డ్ కప్ లు ఆడాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీకి  అసాధ్యమే. ఎందుకంటే ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచకంలో భాగమయ్యాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టాలంటే 2031 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>