Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-8ae6b058-611d-4134-8040-731eb52e873e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-8ae6b058-611d-4134-8040-731eb52e873e-415x250-IndiaHerald.jpgఇటీవల టీమిండియా కొత్త హెడ్ కోచ్గా టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ ఆట విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్లేయర్లు తమ పూర్తిస్థాయి ప్రదర్శన చేయాల్సిందే అని చెబుతూ ఉంటాడు. అలాంటి అగ్రెసివ్ గౌతమ్ గంభీర్ కోచ్ గా వస్తే ఇక టీమిండియాలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే గంభీర్ కోచ్గా వచ్చాడో లేదో టీమ్ ఇండియాలో అనూహ్యమైన మార్పులు చూస్తున్నాం అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేవలCricket {#}Gautam Gambhir;gautham new;gautham;surya sivakumar;mediaగంభీర్ మార్క్.. అతన్ని కూడా వదల్లేదుగా?గంభీర్ మార్క్.. అతన్ని కూడా వదల్లేదుగా?Cricket {#}Gautam Gambhir;gautham new;gautham;surya sivakumar;mediaSat, 03 Aug 2024 10:15:00 GMTఇటీవల టీమిండియా కొత్త హెడ్ కోచ్గా టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ ఆట విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్లేయర్లు తమ పూర్తిస్థాయి ప్రదర్శన చేయాల్సిందే అని చెబుతూ ఉంటాడు. అలాంటి అగ్రెసివ్ గౌతమ్ గంభీర్ కోచ్ గా వస్తే ఇక టీమిండియాలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే గంభీర్ కోచ్గా వచ్చాడో లేదో టీమ్ ఇండియాలో అనూహ్యమైన మార్పులు చూస్తున్నాం అన్న విషయం తెలిసిందే.


 మొన్నటి వరకు కేవలం బ్యాటింగ్ కి మాత్రమే పరిమితమై ఆకట్టుకున్న ప్లేయర్లు.. ఇక ఇప్పుడు తమలో ఉన్న బౌలింగ్ ప్రతిభను కూడా బయట పెడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న టి20 సిరీస్ లో చివరి మ్యాచ్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేసిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. 360 డిగ్రీస్ లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసి అదర కొడతాడు అన్న విషయం అందరికి తెలుసు. కానీ సూర్యలో బౌలర్ కూడా దాగి ఉన్నాడు అన్న విషయం ఇక ఆ ఒక్క ఓవర్ ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైంది. అయితే ఇక కేవలం సూర్య మాత్రమే కాదు పవర్ హిట్టర్ రింకు సింగ్ చేతికి కూడా బంతి అందింది.


 అయితే ఇక ఇప్పుడు శ్రీలంకతో బరిలోకి దిగిన వన్డే సిరీస్ లో కూడా ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడు గౌతమ్ గంభీర్.  ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్ లో ఏకంగా టీమిండియా ఓపెనర్ గిల్ కూడా బౌలర్ గా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్ వేసిన గిల్ 14 పరుగులు ఇచ్చాడు. ఇలా జట్టులో ఉన్న పదిమంది వికెట్ కీపర్ మినహా ఖచ్చితంగా బ్యాటింగ్ బౌలింగ్ చేయాల్సిందే అనే రూల్ ని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో జరుగుతున్న మార్పులపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లు వస్తూ ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>