PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedగత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను టీడీపీ కూటమి నిరంతరం బయటపెడుతోంది. దీంతో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అతిపెద్ద చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల బాగోతం బయటపడింది. జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆన్‌లైన్ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక అంశాల ద్వారా ఎన్‌ఎంసీ కాలేజీలలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంది. ఈ బాగోతాల బట్టబయలు అయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఏపీ మెడికల్ కాలేజీలకు భారీ ఎత్తున పెనాల్టీలు విధించింది. ఒక్కో బోధనా ఆసుపత్రికి ఏకంగా రూ.3 నుంచAP medical colleges {#}Kurnool;kakinada;Tirupati;Vijayawada;Guntur;Vishakapatnam;college;TDP;Andhra Pradesh;YCP;Government;mediaఏపీ మెడికల్ కాలేజీలకు షాక్ ఇచ్చిన ఎన్‌ఎంసీ.. గత ప్రభుత్వ తప్పులే కారణమా...??ఏపీ మెడికల్ కాలేజీలకు షాక్ ఇచ్చిన ఎన్‌ఎంసీ.. గత ప్రభుత్వ తప్పులే కారణమా...??AP medical colleges {#}Kurnool;kakinada;Tirupati;Vijayawada;Guntur;Vishakapatnam;college;TDP;Andhra Pradesh;YCP;Government;mediaSat, 03 Aug 2024 10:30:00 GMTగత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను టీడీపీ కూటమి నిరంతరం బయటపెడుతోంది. దీంతో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అతిపెద్ద చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల బాగోతం బయటపడింది. జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆన్‌లైన్ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక అంశాల ద్వారా ఎన్‌ఎంసీ కాలేజీలలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంది. ఈ బాగోతాల బట్టబయలు అయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఏపీ మెడికల్ కాలేజీలకు భారీ ఎత్తున పెనాల్టీలు విధించింది. ఒక్కో బోధనా ఆసుపత్రికి ఏకంగా రూ.3 నుంచి 5 లక్షల జరిమానా విధించడం జరిగింది. గత ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు ఆసుపత్రులకు పెనాల్టీ పడిందని ఎల్లో మీడియా రాస్కొచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 మెడికల్ కాలేజీలలోని 16 కాలేజీలలో తీవ్రమైన ప్రొఫెసర్ల కొరత ఉందని కూడా ఎన్‌ఎంసీ గుర్తించింది. ఈ సమస్యను త్వరితగతిన సాల్వ్ చేయాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించింది. మొదటిసారి తప్పు జరిగింది కాబట్టి పెనాల్టీ లతో వదిలేస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఈ సమస్యను సాల్వ్ చేయలేకపోతే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను తగ్గిస్తామని, లేదంటే కాలేజీల లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది.

విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీల్లో కూడా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఎన్‌ఎంసీ గుర్తించింది. గత ప్రభుత్వం ఐదు ఆరు మెడికల్ కాలేజీ లను స్థాపించింది. అయితే వీటిలోని 20 విభాగాల్లో 15 విభాగాలు ప్రొఫెసర్లు లేక వెలవెలబోతున్నాయని తెలుసుకున్నారు. తర్వాత ఎన్‌ఎంసీ ఈ కాలేజీలకు కూడా మూడు లక్షల జరిమానా విధించింది. దాంతో మొత్తం 16 మెడికల్ కాలేజీలకు 55 లక్షల పెనాల్టీ విధించినట్లు అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>