MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgపూరీ జగన్నాథ్ హరీష్ శంకర్ లు మంచి స్నేహితులు. అంతేకాదు పూరీ జగన్నాథ్ దగ్గర హరీష్ శంకర్ దర్శకత్వంలో సహాయకుడుగా పనిచేశాడు. అలాంటి వీరిద్దరి స్నేహానికి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ పెట్టిన కండిషన్ వల్ల అనుకోకుండా పోటీ ఏర్పడి వీరిద్దరి స్నేహానికి వారధిగా మారిందా అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకున్న ‘డబల్ ఇస్మార్ట్’ ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా పై చాల ఆశలు పూరీ మరియు రామ్ పెట్టుకున్నారు. వీరిద్దరి కెరియర్ కు ఈసినిమా విజయం అత్యంPURIJAGANNATH{#}harish shankar;Yevaru;ram pothineni;Ishtam;News;August;Cinemaహరీష్ శంకర్ పూరీ జగన్నాథ్ ల మధ్య చిచ్చుపెట్టిన ఓటీటీ !హరీష్ శంకర్ పూరీ జగన్నాథ్ ల మధ్య చిచ్చుపెట్టిన ఓటీటీ !PURIJAGANNATH{#}harish shankar;Yevaru;ram pothineni;Ishtam;News;August;CinemaSat, 03 Aug 2024 08:51:00 GMTపూరీ జగన్నాథ్ హరీష్ శంకర్ లు మంచి స్నేహితులు. అంతేకాదు పూరీ జగన్నాథ్ దగ్గర హరీష్ శంకర్ దర్శకత్వంలో సహాయకుడుగా పనిచేశాడు. అలాంటి వీరిద్దరి స్నేహానికి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ పెట్టిన కండిషన్ వల్ల అనుకోకుండా పోటీ ఏర్పడి వీరిద్దరి స్నేహానికి వారధిగా మారిందా అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు.



పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకున్న ‘డబల్ ఇస్మార్ట్’ ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా పై చాల ఆశలు పూరీ మరియు రామ్ పెట్టుకున్నారు. వీరిద్దరి కెరియర్ కు ఈసినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. పూరీ జగన్నాథ్ స్నేహితురాలు ఛార్మీ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించడంతో ఆమెకు కూడ ఈ మూవీ సక్సస్ అత్యంత కీలకం. నిన్న మొన్నటివరకు ఈసినిమాకు పోటీ లేదు అని అంతా భావించారు.



అయితే ఎవరు ఊహించని విధంగా అదే ఆగష్టు 15న హరీష్ శంకర్ రవితేజా కాంబినేషన్ లో రూపొందిన ‘మిష్టర్ బచన్’ కూడ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ గురు శిష్యుల పోటీలో ఎవరు విజేత అన్న అంశం పై ఇప్పుడు ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి హరీష్ శంకర్ కు తన సినిమాను పూరీ జగన్నాథ్ మూవీతో పోటీ పడటం పెద్దగా ఇష్టం లేకపోయినప్పటికీ ‘మిష్టర్ బచన్’ మూవీని ఆమూవీ ఓటీటీ రైట్స్ కొనుక్కున్న ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఒత్తిడితో తమ సినిమాను కూడ పూరీ ‘డబల్ ఇస్మార్ట్’ తో పోటీగా విడుదల చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న వార్తలు వస్తున్నాయి.



ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థలు అన్నీ తాము రైట్స్ కొనుక్కున్న సినిమాలను ఏ డేట్ కు విడుదలచేయాలి ఆతరువాత ఆసినిమాను ఎప్పుడు ఓటీటీ లో స్ట్రీమ్ చేయాలి అన్న విషయమై తుది నిర్ణయం వారే తీసుకుంటున్నారు అన్న వార్తలు వస్తున్నాయి..
















మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>