Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dog4734e21b-6843-46fc-be7d-137eb0567861-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/dog4734e21b-6843-46fc-be7d-137eb0567861-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మనుషులను చూస్తే చాలు శత్రువులను చూసినట్లుగానే భావిస్తున్నాయి. ఏకంగా దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. కేవలం మనుషులను మాత్రమే కాదు మూగజీవాలను సైతం వదలకుండా కుక్కలు దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్ అని చెప్పాలి. దీంతో వీధి కుక్కలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియక.. ప్రతి ఒక్కరు భయం భయంగానే Dog{#}Cow slaughter;Dogs;villageఆవులను కరిచిన పిచ్చికుక్క.. పాలు పిండి ఊరంతా అమ్మిన యజమాని.. కట్ చేస్తే?ఆవులను కరిచిన పిచ్చికుక్క.. పాలు పిండి ఊరంతా అమ్మిన యజమాని.. కట్ చేస్తే?Dog{#}Cow slaughter;Dogs;villageSat, 03 Aug 2024 11:00:00 GMTఈ మధ్యకాలంలో వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మనుషులను చూస్తే చాలు శత్రువులను చూసినట్లుగానే భావిస్తున్నాయి. ఏకంగా దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. కేవలం మనుషులను మాత్రమే కాదు మూగజీవాలను సైతం వదలకుండా కుక్కలు దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్ అని చెప్పాలి.


 దీంతో వీధి కుక్కలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియక.. ప్రతి ఒక్కరు భయం భయంగానే బ్రతుకుతున్నారు. అయితే ఇటీవల చత్తీస్గడ్ లోని గుండాహుర్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక గ్రామంలో ఒక పిచ్చికుక్క పాలు ఇచ్చే రెండు ఆవులను కరిచింది. అయితే అది జరిగిన సుమారు రెండు నెలల తర్వాత ఆ రెండు ఆవులు రేపిస్ బారిన పడ్డాయి. ఈ విషయం తెలియని ఆవుల యజమాని పాలను పిండి గ్రామంలోని స్థానికులు అందరికీ కూడా విక్రయించాడు. ఈ క్రమంలోనే రేబిస్ బారిన పాడిన ఆవులు చివరికి మృత్యువాత పడటంతో.. ఇక ఆవులు ఇచ్చిన పాలు తాగిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అక్కడికి వైద్య ఆరోగ్య శాఖ బృందం గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి ఆవులను పాలను వినియోగించిన గ్రామస్తులందరికీ కూడా రేబిస్ ఇంజక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు.



 అయితే ఆవులను పిచ్చికుక్కలు కరిచిన విషయం ఆ యజమానికి ముందే తెలుసు అని అందుకే రహస్యంగా ఆసుపత్రికి వెళ్లి అందరికంటే ముందే అతను రేబిస్ వ్యాక్సిన్ వేసుకున్నాడు అంటూ గ్రామస్తులందరూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇక ఇలా రెండు ఆవులు రేబిస్ చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం భయానక వాతావరణం నెలకొంది అని చెప్పాలి. చివరికి ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పక్క గ్రామాలకు కూడా పాకిపోవడంతో ఆవు పాలు తాగడం, స్వీట్లు తినడం పూర్తిగా నిషేధించారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>