PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/errabellid917a072-9e65-480b-a2db-f4ce6ec8ea5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/errabellid917a072-9e65-480b-a2db-f4ce6ec8ea5a-415x250-IndiaHerald.jpg రాజకీయాలలో గెలుపు ఓటములు చాలా సహజం. కొన్నిసార్లు గెలవచ్చు కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయామని కుంగిపోకూడదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. అయితే.. తెలంగాణ మాజీ మంత్రి.. ఎర్రబెల్లి దయాకర్ రావు తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి ఓటమిని అవి చూశారు. అది కూడా పట్టుమని 37 ఏళ్లు కూడా ఉండని ఓ లేడీ చేతిలో దారుణంగా ఓడిపోయారు ఎర్రబెల్లి దయాకర్ రావు. errabelli{#}Errabelli Dayakar Rao;Dharam Soth Redya Naik;Telugu Desam Party;American Samoa;Leader;MLA;Assembly;Reddy;Congress;Minister;Telangana;Successపొలిటిక‌ల్ జెయింట్ కిల్ల‌ర్లు : ఎర్రబెల్లి కోటలు బద్దలు కొట్టిన 26 ఏళ్ల యువతి ?పొలిటిక‌ల్ జెయింట్ కిల్ల‌ర్లు : ఎర్రబెల్లి కోటలు బద్దలు కొట్టిన 26 ఏళ్ల యువతి ?errabelli{#}Errabelli Dayakar Rao;Dharam Soth Redya Naik;Telugu Desam Party;American Samoa;Leader;MLA;Assembly;Reddy;Congress;Minister;Telangana;SuccessSat, 03 Aug 2024 09:35:37 GMT
* ఎర్రబెల్లి పై యశస్విని రెడ్డి విజయం

* 37 ఏళ్లుగా ఎర్రెబల్లికి విజయాలు
 
* 26 ఏళ్ల యువతి చేతిలో ఎర్రెబల్లి ఓటమి



 రాజకీయాలలో గెలుపు ఓటములు చాలా సహజం. కొన్నిసార్లు గెలవచ్చు కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయామని కుంగిపోకూడదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. అయితే.. తెలంగాణ మాజీ మంత్రి.. ఎర్రబెల్లి దయాకర్ రావు  తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి ఓటమిని అవి చూశారు. అది కూడా పట్టుమని 37 ఏళ్లు కూడా ఉండని ఓ లేడీ చేతిలో దారుణంగా ఓడిపోయారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

 దాదాపు 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలుగుదేశం పార్టీలో చాలా కాలం ఉన్న ఎర్రబెల్లి ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరారు. 2018 లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో... ఎర్రబెల్లి దయాకర్ రావు... కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. దాదాపు 50 వేల మెజారిటీతో.. ఎర్రబెల్లి దయాకర్ రావును చిత్తుచిత్తుగా ఓడించారు యశస్విని రెడ్డి.

 అమెరికా నుంచి వచ్చి.. తన అత్త  ఝాన్సీ రెడ్డి సహాయంతో.. ఇంతటి విజయాన్ని అందుకుంది యశస్విని రెడ్డి. 2023 ఎన్నికల కంటే ముందే.. గ్రౌండ్ స్థాయిలో ప్రిపేర్ అయిన యశస్విని రెడ్డి... క్యాడర్ను బాగా మెయింటైన్ చేసుకుంది. అలాగే డబ్బులు కూడా బాగానే ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు పై.. అఖండ మెజారిటీతో విజయం సాధించింది  యశస్విని రెడ్డి.

 అయితే యశస్విని రెడ్డి విజయం తర్వాత... పాలకుర్తి నియోజకవర్గం లో ఆమెపై వ్యతిరేకత కూడా ఇప్పుడే మొదలైంది. యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె అత్త ఝాన్సీ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తోందని  కాంగ్రెస్ కార్యకర్తలు చాలాసార్లు గాంధీభవన్ కి వెళ్లారు. ఇప్పటికి అదే తంతు.. కాంగ్రెస్లో కొనసాగుతోంది. యంగ్ లీడర్ కావడంతో యశస్విని రెడ్డికి ఏం చేయాలో అర్థం కావడం లేదట. సింపుల్గా అత్త మాట వింటుందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>