PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandeshwari--bjp-modi-ap-bjp-rajahmundry-mp-purandeshwari-chandrababu606006ff-13fb-4a7b-b114-0155ba653b1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandeshwari--bjp-modi-ap-bjp-rajahmundry-mp-purandeshwari-chandrababu606006ff-13fb-4a7b-b114-0155ba653b1a-415x250-IndiaHerald.jpg- కేంద్ర మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఆవేద‌న‌ - కూట‌మి ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్న‌ల‌కు చిన్న‌మ్మ ద‌గ్గ‌ర నో ఆన్స‌ర్‌ ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు .. రాజ‌మ‌హేంద్ర వ‌రం ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి బాగా కోపం వ‌చ్చేసింద‌ట‌. అస‌లు కూల్‌గా ఉండే చిన్న‌మ్మ‌కు ఎందుకు ? కోపం వ‌చ్చింది ? ఆమె కోపానికి కార‌ణం ఏంటో తెలుసుకుందాం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పురందేశ్వ‌రి అదేంటి నేను వ‌స్తుంటే మీడియాను పిల‌వ‌రా.. చిన్న చిన్న మీడియాను కాదు.. మెయిన్ మీడియాను పిల‌వాలి క‌దా ? అని ఆమె పార్టీ నేత‌లpurandeshwari ; bjp; modi; ap bjp; Rajahmundry mp purandeshwari; chandrababu{#}sunday;Bharatiya Janata Party;central government;MP;Andhra Pradesh;Party;media;Indiaచిన్న‌మ్మ చిందులు... పురందేశ్వ‌రికి ఇంత కోపం ఎందుకు..?చిన్న‌మ్మ చిందులు... పురందేశ్వ‌రికి ఇంత కోపం ఎందుకు..?purandeshwari ; bjp; modi; ap bjp; Rajahmundry mp purandeshwari; chandrababu{#}sunday;Bharatiya Janata Party;central government;MP;Andhra Pradesh;Party;media;IndiaFri, 02 Aug 2024 17:03:00 GMT- కేంద్ర మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఆవేద‌న‌
- కూట‌మి ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్న‌ల‌కు చిన్న‌మ్మ ద‌గ్గ‌ర నో ఆన్స‌ర్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు .. రాజ‌మ‌హేంద్ర వ‌రం ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి బాగా కోపం వ‌చ్చేసింద‌ట‌. అస‌లు కూల్‌గా ఉండే చిన్న‌మ్మ‌కు ఎందుకు ?  కోపం వ‌చ్చింది ? ఆమె కోపానికి కార‌ణం ఏంటో తెలుసుకుందాం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పురందేశ్వ‌రి అదేంటి నేను వ‌స్తుంటే మీడియాను పిల‌వ‌రా.. చిన్న చిన్న మీడియాను కాదు.. మెయిన్ మీడియాను పిల‌వాలి క‌దా ? అని ఆమె పార్టీ నేత‌ల‌పై క‌స్సు బ‌స్సు లాడేవార‌ట‌. పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నా కూడా ఆమె ప్ర‌తి శ‌నివారం.. ఆదివారం ఏపీలోనే ఉంటున్నారు.


అయితే ప‌రుచూరు లేదా రాజ‌మండ్రి వ‌చ్చి సైలెంట్ గానే వెళ్లిపోతున్నారు. పైగా ఆమె ఏపీ బీజేపీ అధ్య‌క్ష‌రాలు గానే కాకుండా.. ఇటు ఎంపీ గా కూడా ఉండ‌డంతో ఆమె వార్త‌ల‌కు.. ఆమె కామెంట్ల‌కు మీడియాలో ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల్సి ఉంది. అయితే ఏం జ‌రిగిందో.. ఎక్క‌డ తేడా కొట్టిందో గాని .. ఆమె తాజాగా మీడియా ను ఎప్పుడు ప‌డితే అప్పుడు పిలుస్తారా .. మైండ్ ఉండొద్దా ? అని పార్టీలోనే రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌పై కాస్త కోప్ప‌డిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.


అయితే కొన్ని విష‌యాల్లో ఆమె మీడియాకు ఎలా స‌మాధానం చెప్పాలి.. కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌పై మీడియా త‌న‌ను ప్ర‌శ్నిస్తే త‌న‌కు .. బీజేపీ కి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆమె భావిస్తున్నార‌ట‌. దీనికి తోడు ఆమె త‌న‌కు ఖ‌చ్చితంగా కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు.. ఆశ‌లు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం త‌న‌ను ప‌ట్టించుకోక పోవ‌డం కూడా ఆమెను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తున్న‌ట్టు టాక్ ? అందుకే ఆమె కాస్త ఇటీవ‌ల చికాకు.. కోపంగానే ఉంటున్నార‌ట‌.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>