PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tamilanadu-assembly-jayalalitha-politics-tamilanadu-cm-1172b8c7-0c5d-4013-b31c-6e07f86f3d24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tamilanadu-assembly-jayalalitha-politics-tamilanadu-cm-1172b8c7-0c5d-4013-b31c-6e07f86f3d24-415x250-IndiaHerald.jpgఏ అసెంబ్లీలో చూసినా ఏమున్నది గర్వ కారణం అంత అవమానాల పర్వమన్నట్టు సాగుతున్నాయి దేశవ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు. కనీసం మహిళలే మహిళలకు గౌరవం ఇవ్వకుండా దారుణంగా అవమానపరుచుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉంటే తమిళ రాష్ట్రంలో మరీ దారుణంగా రాజకీయాలు తయారయ్యాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉందంటే ప్రతిపక్షం వారు దారుణంగా అవమానాల పాలు కావాల్సిందే. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ విరుద్ధంగా ఏది చేసినా ప్రతిపక్షంలో ఉన్నవారు పడాల్సిందే. ఇలా ఒక తంతు వారిది నడిస్తే మరో తంతు వీరిదTAMILANADU;ASSEMBLY;JAYALALITHA;POLITICS; TAMILANADU CM {#}jayalalitha;Tamilnadu;Ishtam;Telangana Chief Minister;Tamil;politics;Assembly;Telugu;Party;Governmentదుశ్శాసనపర్వం: నిండు సభలో జయలలితకు అవమానం..!!దుశ్శాసనపర్వం: నిండు సభలో జయలలితకు అవమానం..!!TAMILANADU;ASSEMBLY;JAYALALITHA;POLITICS; TAMILANADU CM {#}jayalalitha;Tamilnadu;Ishtam;Telangana Chief Minister;Tamil;politics;Assembly;Telugu;Party;GovernmentFri, 02 Aug 2024 08:14:40 GMT-పేద ప్రజలకు తల్లి జయలలిత..
- నిండు సభలో చీర పట్టి లాగిన సభ్యులు..
- అవమానం జరిగిన చోటే ముఖ్యమంత్రిగా ప్రమాణం..


ఏ అసెంబ్లీలో చూసినా ఏమున్నది గర్వ కారణం అంత అవమానాల పర్వమన్నట్టు సాగుతున్నాయి దేశవ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు. కనీసం మహిళలే మహిళలకు గౌరవం ఇవ్వకుండా దారుణంగా అవమానపరుచుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉంటే తమిళ రాష్ట్రంలో మరీ దారుణంగా రాజకీయాలు తయారయ్యాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉందంటే ప్రతిపక్షం వారు దారుణంగా అవమానాల పాలు కావాల్సిందే. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ విరుద్ధంగా ఏది చేసినా ప్రతిపక్షంలో ఉన్నవారు పడాల్సిందే. ఇలా ఒక తంతు వారిది నడిస్తే మరో తంతు వీరిది నడుస్తుంది అన్నట్టు రివేంజ్ రాజకీయాలే చేస్తున్నారు. కనీసం సభా మర్యాదలను కూడా కాపాడకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇదే తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో అలనాటి ముఖ్యమంత్రి జయలలిత పై నిండు సభలో సభ మర్యాదలను విడిచిపెట్టి ఒక మహిళా రాజకీయ నాయకురాలి చీర పట్టుకుని లాగారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 
జయలలితకు అవమానం :
1989 సమయం అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఒక మహిళా నేత ప్రభుత్వం దుర్మార్గం చేస్తోంది అవినీతికి పాల్పడుతోంది అంటూ నిండు సభలో ప్రశ్నించింది. దానికి ఆధారాలు కూడా చూపిస్తాను అంటూ  గొంతెత్తుతూ అరిచింది. ఇదే సందర్భంలో అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఒక్కసారిగా ఆమెపైకి లేచి ఎదురు దాడికి దిగారు. చివరికి జుట్టు పట్టుకొని కొట్టడానికి కూడా వచ్చారు. చీరను లాగి వివస్త్రను చేసే ప్రయత్నం చేశారు. అప్పటివరకు ఎంతో గౌరవ సభగా ఉన్నటువంటి తమిళనాడు శాసనసభ ఆ ఒక్క ఘటనతో కౌరవ సభగా మారింది. అలనాడు కౌరవ,పాండవుల నిండు సభలో ద్రౌపది పడ్డ అవమానమే  తమిళనాడు అసెంబ్లీలో మహిళా నేత జయలలిత పడింది. 

ఇదే సమయంలో ఆ మహిళా నేత దారుణమైనటువంటి ఏడుపుతో అదే సభా వేదికగా  పడి లేచిన కెరటంలా  ఎక్కడైతే నన్ను మీరు అవమానపరిచారో అక్కడికి మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యేదాకా అసెంబ్లీ లో అడుగు పెట్టనని చెప్పి శపధం చేసి వెళ్ళింది. చివరికి ప్రజల యొక్క ఆదరాభిమానాలతో అద్భుతమైన మెజారిటీతో  తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా ఆ నిండు సభలో అడుగు పెట్టింది. ఆమె జీవితం మొత్తం పోరాటాల మయమే.. అవమానాల నుంచి  ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కుతూ తమిళ ప్రజల హృదయాలను గెలుచుకుంది. చివరికి జయలలిత అనే పేరు నుంచి ప్రతి ఒక్కరికి అమ్మా అని పిలిపించుకునే స్థాయికి ఎదిగింది. అలాంటి జయలలిత జీవిత ప్రయాణం ఎంతోమంది ప్రస్తుత రాజకీయ నాయకులకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>