MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1a2c42e1-597d-4192-a485-4275b00afc4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1a2c42e1-597d-4192-a485-4275b00afc4f-415x250-IndiaHerald.jpgఅభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, తదుపరి తంగలాన్ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో లాంచ్‌కి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంచలన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాంగళం సినిమా యూనిట్ తాజాగా ఆడియో లాంచ్ డేట్‌ను ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం నుండి tollywood{#}Kumaar;malavika mohanan;Audio;Posters;jeevitha rajaseskhar;vikram;Kollywood;Chitram;Hero;Darsakudu;Director;Cinemaతంగలాన్ ఆడియో లాంఛ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే ..!తంగలాన్ ఆడియో లాంఛ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే ..!tollywood{#}Kumaar;malavika mohanan;Audio;Posters;jeevitha rajaseskhar;vikram;Kollywood;Chitram;Hero;Darsakudu;Director;CinemaFri, 02 Aug 2024 19:30:00 GMTఅభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, తదుపరి తంగలాన్ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో లాంచ్‌కి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంచలన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాంగళం సినిమా యూనిట్ తాజాగా ఆడియో లాంచ్ డేట్‌ను ప్రకటించింది.

 ఇది ఇలా ఉంటే ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 2 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక ఆడియో లాంఛ్ కి సంబందించిన అప్డేట్ ను కూడా వెల్లడించారు. ఈ ఘన కార్యక్రమాన్ని ఆగస్టు 5 వ తేదీన ఆడియో లాంచ్ ని జరుపుకుంటున్నారు. ఈ వేదికపై మూవీకి సంబంధించిన ఇతర వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్

 సంగీతం అందించారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్  "తంగలాన్" సినిమాలో విక్రమ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఇక విక్రమ్ తన ప్రతి సినిమాలోనూ కొత్తగా ప్రయత్నించడానికి ప్రసిద్ధి. "తంగలాన్" సినిమాలో కూడా అతను తన నటనతో అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాడు. సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>