MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/harish-shankar5797fa0b-af36-4456-b97b-44c24ef9e54c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/harish-shankar5797fa0b-af36-4456-b97b-44c24ef9e54c-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ దర్శకులు పెద్దగా ఖాళీగా ఉండేవారు కాదు. సంవత్సరానికి దర్శకత్వం వహించిన మూడు , నాలుగు సినిమాలను ఈజీగా విడుదల చేస్తూ ఉంటా ఉండేవారు. ఇలా వారు సంవత్సరానికి మూడు , నాలుగు సినిమాలు విడుదల చేయడానికి పక్కా ప్లానింగ్ వేసుకుంటూ ఉండేవారు. అందులో భాగంగా ఒక సినిమా షెడ్యూల్ ఉదయం ఉంటే , మరొక సినిమా షెడ్యూల్ రాత్రి పెట్టుకోవడం. ఇలా రాత్రి , పగళ్ళు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ చాలా తొందరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేవారు. అలా చేయడం ద్వారా వారు సంవత్సరానికి తక్కువharish shankar{#}harish shankar;Balakrishna;ram pothineni;kalyan;Chiranjeevi;Ravi;ravi teja;Mister;Darsakudu;Director;Cinemaసీనియర్ దర్శకులను గుర్తు చేస్తున్న హరీష్ శంకర్.. ఇలా అయితే కష్టం అంటున్న యంగ్ డైరెక్టర్స్..?సీనియర్ దర్శకులను గుర్తు చేస్తున్న హరీష్ శంకర్.. ఇలా అయితే కష్టం అంటున్న యంగ్ డైరెక్టర్స్..?harish shankar{#}harish shankar;Balakrishna;ram pothineni;kalyan;Chiranjeevi;Ravi;ravi teja;Mister;Darsakudu;Director;CinemaFri, 02 Aug 2024 13:55:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ దర్శకులు పెద్దగా ఖాళీగా ఉండేవారు కాదు. సంవత్సరానికి దర్శకత్వం వహించిన మూడు , నాలుగు సినిమాలను ఈజీగా విడుదల చేస్తూ ఉంటా ఉండేవారు. ఇలా వారు సంవత్సరానికి మూడు , నాలుగు సినిమాలు విడుదల చేయడానికి పక్కా ప్లానింగ్ వేసుకుంటూ ఉండేవారు. అందులో భాగంగా ఒక సినిమా షెడ్యూల్ ఉదయం ఉంటే , మరొక సినిమా షెడ్యూల్ రాత్రి పెట్టుకోవడం. ఇలా రాత్రి , పగళ్ళు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ చాలా తొందరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేవారు. అలా చేయడం ద్వారా వారు సంవత్సరానికి తక్కువలో తక్కువ మూడు , నాలుగు సినిమాలను విడుదల చేస్తూ ఉండేవారు.

కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఒక్కో దర్శకుడు సంవత్సరానికి ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోతున్నాడు. ఇకపోతే హరీష్ శంకర్ సీనియర్ దర్శకులను గుర్తుకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే కొంత కాలం క్రితం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీని మొదలు పెట్టాడు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయాలతో బిజీ కావడం వల్ల వెంటనే హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని మొదలు పెట్టి ఇప్పటికే పూర్తి కూడా చేశాడు.

మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల కూడా చేయనున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పవన్ జాయిన్ కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆలోపు రామ్ పోతినేని తో మరో మూవీ ని స్టార్ట్ చేసి చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అని ఈ దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చిరంజీవి , బాలకృష్ణ లతో కూడా మూవీ లు చేయడానికి కూడా హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వేళ సెట్ అయితే ఆ మూవీలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి  సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా హరీష్ శంకర్ వరుస పెట్టి సినిమాలను పూర్తి చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>