EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rahul-reputunna-kualam-chicchu-indiac4d8bf70-3658-4355-86b7-b85c3db8a7b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rahul-reputunna-kualam-chicchu-indiac4d8bf70-3658-4355-86b7-b85c3db8a7b5-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు.. దీనికి సంబంధించిన ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో సభలను హోరెత్తిస్తున్నారు. తొలిసారి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్నట్లే. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాహుల్ రెండు చేతులతో పట్టుకుంటున్నారు. గతంతో పోల్చితే ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. గతంలో ఎప్పుడూ పాత పద్ధతిలో మాట్లాడే ఆయన ఈ సారి తన పంథా మార్చారు. కేంద్రంపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా ప్రధాrahul gandhi{#}Anurag Singh;Anurag Thakur;Narendra Modi;Party;central government;Bharatiya Janata Party;Rahul Gandhi;Prime Minister;Congress;rahul;Rahul Sipligunj;Indiaరాటుదేలిపోతున్న రాహుల్ గాంధీ.. ఈసారి మోదీకి చుక్కలేనా?రాటుదేలిపోతున్న రాహుల్ గాంధీ.. ఈసారి మోదీకి చుక్కలేనా?rahul gandhi{#}Anurag Singh;Anurag Thakur;Narendra Modi;Party;central government;Bharatiya Janata Party;Rahul Gandhi;Prime Minister;Congress;rahul;Rahul Sipligunj;IndiaFri, 02 Aug 2024 06:00:00 GMTపార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు.. దీనికి సంబంధించిన ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో సభలను హోరెత్తిస్తున్నారు. తొలిసారి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్నట్లే. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాహుల్ రెండు చేతులతో పట్టుకుంటున్నారు. గతంతో పోల్చితే ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది.


గతంలో ఎప్పుడూ పాత పద్ధతిలో మాట్లాడే ఆయన ఈ సారి తన పంథా మార్చారు. కేంద్రంపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే గురి పెడుతున్నారు. దీర్ఘకాలిక ఉపన్యాసాలు ఇస్తూ..  ఇండియా కూటమి నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ సమయంలో కులం కలకలం సృష్టించింది. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్ సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు.


గతంలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం కాదు. దానిని ఓ సారి చదవాలి. అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో తెలుసా అని రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు అనురాగ్ ఠాకూర్. తాజాగా కుల గణన గురించి మాట్లాడిన రాహుల్ గాంధీని ఉద్దేశించి.. తమది ఏ కులమో కూడా తెలియని వారు కూడా కుల గణన కోరుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


దీంతో ఇవి రాజకీయంగా పెను దుమారమే రేపుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు. అనురాగ్ ప్రసంగాన్ని మోదీ తన  ఖాతాలో పోస్టు చేశారు. కాంగ్రెస్ దేశాన్ని కుల గణన పేరుతో విభజించాలని చూస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అనుమతి కోరారు. ఈ కులం అంశం రాజకీయంగా ఇంకా ఎంత దుమారం రేపుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>