PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy41525367-4802-4f48-999c-5c896db87f82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy41525367-4802-4f48-999c-5c896db87f82-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. ప్రజా పాలనపై అధికారులు ఫోకస్ అనేది పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ముందుకు నడిపిస్తారని ప్రజలు భారీగా ఒక పార్టీవైపు మొగ్గుచూపి అధికారం చేతికిస్తే వారు మాత్రం ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ హద్దులు చేరిపేస్తున్నారు. దానికి నిదర్శనమే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు చేసిన శపధం.2019లో ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేనివిధంగా చరిత్ర సృష్టించేలా జగన్మోహనరెడ్డి 151 సీట్లు సాధించి రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయితే ప్రjaganmohanreddy{#}history;November;Wife;politics;Telangana Chief Minister;Andhra Pradesh;CM;Assembly;Government;Minister;Jagan;CBN;Party;YCP;Rojaఅసెంబ్లీ.. అవమానాలు: ముందుచూపుతో అసెంబ్లీకి దూరమవుతున్న జగన్..!అసెంబ్లీ.. అవమానాలు: ముందుచూపుతో అసెంబ్లీకి దూరమవుతున్న జగన్..!jaganmohanreddy{#}history;November;Wife;politics;Telangana Chief Minister;Andhra Pradesh;CM;Assembly;Government;Minister;Jagan;CBN;Party;YCP;RojaFri, 02 Aug 2024 09:48:23 GMT* ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి అవమానాలే లక్ష్యంమనేలా అసెంబ్లీ చర్చలు.!

* సీన్ అర్ధమయ్యే.. జగన్ అసెంబ్లీకి దూరమా.?

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. ప్రజా పాలనపై అధికారులు ఫోకస్ అనేది పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ముందుకు నడిపిస్తారని ప్రజలు భారీగా ఒక పార్టీవైపు మొగ్గుచూపి అధికారం చేతికిస్తే వారు మాత్రం ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ హద్దులు చేరిపేస్తున్నారు. దానికి నిదర్శనమే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు చేసిన శపధం.2019లో ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేనివిధంగా చరిత్ర సృష్టించేలా జగన్మోహనరెడ్డి 151 సీట్లు సాధించి రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయితే ప్రతిపక్షానికి అసెంబ్లీలో చుక్కలు చూపించారు. అయితే అసెంబ్లీలో ప్రజా సమస్యలు గూర్చి మాట్లాడటం అనేది మర్చిపోయి వ్యక్తిగత ధూషణలే ఎక్కువైపోయాయి.అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే లో అంబటి రాంబాబు, వంశీ, నాని, రోజా లాంటి వారు అసెంబ్లీలో ప్రతిపక్షనేత అయినా చంద్రబాబును బంతి ఆట ఆడేసుకున్నారు.అధికార మదంతో ఏడు పదుల వయసులో కూడా చంద్రబాబును ఏడిపించేలా చేసిన తీరు అనేది ప్రజలకు నచ్చలేదని వారు 2024 ఎన్నికల్లో తమ ఓటు రూపంలో చూపించారు.అసలు ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబుకి తీవ్ర అవమానం జరగడానికి కారణం ఏంటంటే తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడారు. సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించారు. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తీవ్ర అవమాన భారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు.’ ఇన్నేళ్లు పరువు కోసం బతికాను. 

అలాంటిది ఈరోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. ఇలాంటి సభలో నేను ఉండను. మళ్లీ ముఖ్యమంత్రి గానే ఈ సభలో అడుగు పెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. అందరికీ ఓ నమస్కారం ‘ అంటూ 2021 నవంబర్ 19న శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేసి చంద్రబాబు బాయ్ కట్ చేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని రోదించారు.అసెంబ్లీ సాక్షిగా అధికార ప్రభుత్వం ఏదైనా సరే విపక్షాపార్టీకి భయాందోళనకు అవమానానికి గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారని ప్రతిపక్ష పార్టీ అనేది అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యల పట్ల పోరాడాడానికి కూడా ఆలోచిస్తుంది.ఆనాడు చంద్రబాబు గారు శపధం చేసి మరీ అసెంబ్లీ రాకుండా ప్రజల్లో మమైకం అయి మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. దాంతో ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేశారు. అయితే గతంలో చంద్రబాబును అవమానించిన తీరును దృష్టిలో పెట్టుకొని జగన్ అసెంబ్లీకి రాకుండా ఏవేవో కుంటి సాకులు చెప్పి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. అసెంబ్లీ అంటే ప్రజాసమస్యల్ని ఇరు పక్షాలు గుర్తించి అక్కడ వాటి గూర్చి చర్చించి వాటిని దూరం చేసే విధంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా హద్దులు దాటేసి వారి వారి కుటుంబాలపై కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అందుకేనేమో జగన్ తెలివిగా అక్కడ కూటమి బలాన్ని గుర్తించి అసెంబ్లీ కి వెళ్లకుండా సాకులు చెప్పి దాటేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>