Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla4b4e589-a6fd-42f0-b0aa-ad3763d93517-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla4b4e589-a6fd-42f0-b0aa-ad3763d93517-415x250-IndiaHerald.jpgబిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా ఐపీఎల్ లో భాగం కావాలని అనుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా ప్లేయర్లు వివిధ జట్ల తరఫున ఆడటం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. మొదట వేలంలో పాల్గొనేందుకు పేరును దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత తమకు తక్కువ ధర దక్కింది అన్న కారణంతో వ్యక్తిగతIpl{#}Application;BCCI;Indianఐపీఎల్ 2025 : ప్లేయర్ అలా చేస్తే.. బ్యాన్ చేసేస్తారట?ఐపీఎల్ 2025 : ప్లేయర్ అలా చేస్తే.. బ్యాన్ చేసేస్తారట?Ipl{#}Application;BCCI;IndianThu, 01 Aug 2024 15:45:00 GMTబిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా ఐపీఎల్ లో భాగం కావాలని అనుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా ప్లేయర్లు వివిధ జట్ల తరఫున ఆడటం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. మొదట వేలంలో పాల్గొనేందుకు పేరును దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత తమకు తక్కువ ధర దక్కింది అన్న కారణంతో వ్యక్తిగత కారణాలతో చివరికి ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.


 ఈ క్రమంలోనే  జట్టు సమతుల్యత కోసం ఆయా ప్లేయర్లను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నాయ్ ఆయా ఫ్రాంచైజీలు. చివరికి అర్ధాంతరంగా ఆటగాళ్లు తప్పుకుంటూ ఉండటంతో అయోమయంలో పడిపోతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ కి ముందు కూడా ఇలాగే ఎంతో మంది ప్లేయర్లు అర్ధాంతరంగా ఐపిఎల్ ను సీజన్ దూరం పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి ఆటగాళ్ళ విషయంలో ఈసారి కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఐపీఎల్, బిసిసిఐ మధ్య అటు రిటెన్షన్, వేలంకి సంబంధించి సమావేశం నిర్వహించారు.


 ఈ సమావేశంలో అకారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్న విదేశీ ప్లేయర్లను బ్యాన్ చేయాలని ఫ్రాంచైజీ యజమానులు అందరూ కూడా అటు బీసీసీఐను అయిన కోరినట్లు తెలుస్తుంది. ఇలాంటి వారి వల్ల జట్టు సమతుల్యత  దెబ్బతింటుంది అని వాదించారట జట్టు యాజమాన్యాలు. బలమైన కారణంతో తప్పుకుంటే తప్ప మిగతా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అటు ఫ్రాంచైజీలా డిమాండ్ పై బిసిసిఐ కూడా సానుకూలంగానే స్పందించారు అనేది తెలుస్తుంది. దీంతో 2025 ఐపీఎల్ సీజన్కు ముందు ఎవరైనా ఆటగాడు ఆ కారణంగా ఇలా జట్టు నుంచి వైదొలిగితే అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>