PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/brs-d3b52c9f-2b12-4e86-9016-2d6baa1bad40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/brs-d3b52c9f-2b12-4e86-9016-2d6baa1bad40-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్‌ పార్టీకి సీన్‌ రివర్స్‌ అవుతోంది. కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గోడకు కొట్టిన బంతిలా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకే వచ్చారు. ఇంకొంతమంది అలాగే తిరిగి వస్తారన్న ప్రచారంలో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు తెరపైకి వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఛాంబర్ కు వెళ్లి మరీ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు తెల్లం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నానని కలిసి వెళ్లిన వెంటనే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎbrs {#}Parliment;Kala Venkata Rao;Assembly;Khammam;U Turn;Venkata Rao;Bhadrachalam;srinivas;Yevaru;KTR;Reddy;MLA;Congress;Party;Minister;Fireరేవంత్‌ కు షాక్‌..బీఆర్‌ఎస్‌ లోకి మరో 6 ఎమ్మెల్యేలు ?రేవంత్‌ కు షాక్‌..బీఆర్‌ఎస్‌ లోకి మరో 6 ఎమ్మెల్యేలు ?brs {#}Parliment;Kala Venkata Rao;Assembly;Khammam;U Turn;Venkata Rao;Bhadrachalam;srinivas;Yevaru;KTR;Reddy;MLA;Congress;Party;Minister;FireThu, 01 Aug 2024 09:02:10 GMTకాంగ్రెస్‌ పార్టీకి సీన్‌ రివర్స్‌ అవుతోంది. కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గోడకు కొట్టిన బంతిలా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకే వచ్చారు. ఇంకొంతమంది అలాగే తిరిగి వస్తారన్న ప్రచారంలో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు తెరపైకి వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఛాంబర్ కు వెళ్లి మరీ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు తెల్లం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నానని కలిసి వెళ్లిన వెంటనే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నేతలను కలవడం చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఇంకొందరు యూటర్న్ తీసుకుంటారని తెలుస్తోంది.


తెల్లం వెంకట్రావు కూడా తిరిగి వస్తారని అంటున్నాయి బీఆర్ఎస్ పార్టీవర్గాలు. తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రాచలం కాంగ్రెస్ టికెట్ కోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్య ఉండటంతో అతడిని కాదని టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపి టికెట్ హామీతో గులాబీ కండువా కప్పుకున్నారు తెల్లం వెంకట్రావు. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెంకట్రావు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటిలోకి చేరారు తెల్లం వెంకట్రావు. నియోజకవర్గ అభ్యర్థి కోసమే పార్టీ మారానని చెప్పుకున్నారు భద్రాచలం ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తెల్లం వెంకట్రావు కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లి వారిని కలవడం.... ఆ ఫోటో బయటకు రావడంతో మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళుతున్నారని ప్రచారం మొదలైంది. అయితే వెంకట్రావు ఎక్కడికి వెళ్లరని.... పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ నేతలను కలిసారని అంటున్నారు మంత్రి పొంగులేటి. తమ పార్టీలోకి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లరని అంటున్నారు పొంగులేటి. బీఆర్ఎస్ లో కొందరు అల్పసంతోషికులు ఉన్నారు.

నా ఫోటో తీసేసి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఖండించారు. చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మంత్రుల ఛాంబర్ లోకి వచ్చి కలుస్తున్నారని.... వారంతా పార్టీ మారేవారైనా అని వెంకట్రావు ప్రశ్నిస్తున్నారు. కండువా మార్చాక మాట తప్పను.... మడమ తిప్పనని తెల్లం వెంకట్రావు చెప్తున్నా ప్రచారం మాత్రం ఆగలేదు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలంలో ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరని.... అందుకే కాంగ్రెస్ లో చేరి నిధులు సాధించి పనులు ప్రారంభించారని అంటున్నారు తెల్లం వెంకట్రావు. ఏది ఏమైనా ఒక్కసారి కలిసినందుకే రాజకీయంగా సంచలనంగా మారి చర్చకు దారితీసింది. దీంతో తెల్లం, అరికపూడీగాంధీ, ప్రకాష్, కాలే యాదయ్య, పోచారం, సంజయ్‌కుమార్‌ మళ్లీ ఘర్‌ వాపస్‌ రానున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>