PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-jagan-mohan-reddy-ysrcp-congress-ys-sharmila-14224e7a-6375-4eb2-a438-2a045cd51876-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-jagan-mohan-reddy-ysrcp-congress-ys-sharmila-14224e7a-6375-4eb2-a438-2a045cd51876-415x250-IndiaHerald.jpgఇదే ఇప్పుడు కీలక ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల‌కు ముందు.. తర్వాత ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎవ‌రి కోసం ప‌నిచేస్తోంది? ఎవ‌రి కోసం.. ప్ర‌యాస ప‌డుతోంద‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వా నికి ఏ పార్టీ ల‌క్ష్య‌మైనా.. పుంజుకోవ‌డం.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవ‌డం. ఈ రెండూ లేన‌ప్పుడు వృధా నే. ప్ర‌స్తుతం కాంగ్రెస్ విష‌యంలో ఈ రెండు క‌నిపించ‌డం లేదు. పార్టీ ప‌గ్గాలు ఎవ‌రికి అప్ప‌గించార‌నేది ప్ర‌శ్న కాదు. పార్టీ ఎలా ముందుకు సాగుతోంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎలా అడుగులు వేస్తోంద‌న్న‌ది ప్ర‌శ్న‌.ys jagan; jagan mohan reddy; ysrcp; Congress; ys sharmila {#}Rahul Gandhi;Congress;Party;Andhra Pradeshకాంగ్రెస్ పార్టీ జ‌నం కోస‌మా.. జ‌గ‌న్ కోస‌మా ..!కాంగ్రెస్ పార్టీ జ‌నం కోస‌మా.. జ‌గ‌న్ కోస‌మా ..!ys jagan; jagan mohan reddy; ysrcp; Congress; ys sharmila {#}Rahul Gandhi;Congress;Party;Andhra PradeshThu, 01 Aug 2024 17:31:19 GMTఇదే ఇప్పుడు కీలక ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల‌కు ముందు.. తర్వాత ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎవ‌రి కోసం ప‌నిచేస్తోంది?  ఎవ‌రి కోసం.. ప్ర‌యాస ప‌డుతోంద‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వా నికి ఏ పార్టీ ల‌క్ష్య‌మైనా.. పుంజుకోవ‌డం.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవ‌డం. ఈ రెండూ లేన‌ప్పుడు వృధా నే. ప్ర‌స్తుతం కాంగ్రెస్ విష‌యంలో ఈ రెండు క‌నిపించ‌డం లేదు. పార్టీ ప‌గ్గాలు ఎవ‌రికి అప్ప‌గించార‌నేది ప్ర‌శ్న కాదు. పార్టీ ఎలా ముందుకు సాగుతోంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎలా అడుగులు వేస్తోంద‌న్న‌ది ప్ర‌శ్న‌.


ఈ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్ పార్టీ త‌ప్పుట‌డుగుల్లోనే ముందుకు సాగుతోంది. ఇక‌ప్పుడు రాష్ట్రాల్లో ఇంచార్జుల‌కు పూర్తి అధికారాలు ఉండేవి కావు. కొంత వ‌ర‌కు మాత్ర‌మే వారికి ప్రాధాన్యం ఉండేది. కీల‌క మైన వ్య‌వ‌హారాల‌ను పూర్తిగా పార్టీ అధిష్టానం ప‌ర్య‌వేక్షించేది.  అందుకే.. పార్టీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం అయింది. అంతేకాదు.. పార్టీ ప‌లు రాష్ట్రాల్లో సుదీర్ఘ‌కాలం కూడా అధికారంలోనే కొన‌సాగింది. కానీ, రాను రాను.. ఈ ప‌రిస్థితి మారిపోయింది. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ప‌గ్గాలు ఇచ్చి.. ఊరుకోవ‌డంతో ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది.


అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ కూడా పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. స్వ‌తంత్రం ఇవ్వాలి. కానీ, దీనిని మితిమీరి ఇస్తేనే ప్ర‌మాదం పొంచి ఉంద‌నేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గ్ర‌హిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో పార్టీ అధికారం కోల్పోయింది. నాయ‌కులు కూడా పోయారు. దీంతో ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాయ‌కుల‌ను కూడా లైన్‌లో పెడుతున్నారు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. కూడా ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది.


జ‌నం కోసం ప‌నిచేయాల్సిన కాంగ్రెస్ పార్టీ జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తోంద‌న్న వాద‌న బ‌ల‌ప‌డుతోంది. ఎక్క‌డా కూడా కాంగ్రెస్ మార్కు క‌నిపించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. పైకి చూస్తే.. ఇది వాస్త‌వం కూ డా. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల భావోద్వేగాలు రెచ్చ‌గొట్టుకోవ‌చ్చు. కానీ, త‌ర్వాతైనా ప్ర‌జ‌ల‌ను ద‌రిచేర్చు కునేందుకు ప్ర‌య‌త్నాలు చేయాలిక‌దా! కానీ, ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అడుగు వేయ‌లేదు. దీంతో ప్ర‌జ‌లు స‌హ‌జంగానే కాంగ్రెస్ ఉన్న‌ది జనం కోసం కాద‌ని.. జ‌గ‌న్ కోస‌మేన‌ని చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>