EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jobs756783e8-2e85-4d35-a4cc-dd4c21ed2da4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jobs756783e8-2e85-4d35-a4cc-dd4c21ed2da4-415x250-IndiaHerald.jpgఅమ్మా పెట్టా పెట్టదు.. అడుక్కొని తిననివ్వదు అన్న చందంగా.. ప్రభుత్వాల ఫీ రియింబర్స్ మెంట్ సకాలంలో ఇవ్వదు. పోనీ కాలేజీలను ఫీజులను వసూలు చేసుకోనివ్వవు. ప్రభుత్వాలు దివాళా తీసి చాలా కాలం అయింది. పన్నులు వసూలు చేసి వడ్డీలు కట్టలేక ఇక వాటి పని ఎప్పుడో అయిపోయింది. మేం ఫీజులు కట్టలేం అంటే అంతకు మించిన రాజకీయ ఆత్మహత్య సాదృశ్యం ఇంకోటి ఉండదు. అందుకే ప్రభుత్వాలు రెండేళ్లకో, మూడేళ్లకో రీయింబర్స్ మెంట్ విడుదల చేస్తుంటాయి. దబ్బులు లేకపోతే యాజమాన్యాలు జీతాలు ఎలా చెల్లిస్తాయి. ఎప్పుడో ఆరు నెలలకి ఓ సారి జీతాలుjobs{#}American Samoa;Drugs;college;Yevaruమన దేశంలో చదువుల పరిస్థితి ఇంత దారుణమా?మన దేశంలో చదువుల పరిస్థితి ఇంత దారుణమా?jobs{#}American Samoa;Drugs;college;YevaruThu, 01 Aug 2024 08:09:00 GMTఅమ్మా పెట్టా పెట్టదు.. అడుక్కొని తిననివ్వదు అన్న చందంగా.. ప్రభుత్వాల ఫీ రియింబర్స్ మెంట్ సకాలంలో ఇవ్వదు. పోనీ కాలేజీలను ఫీజులను వసూలు చేసుకోనివ్వవు. ప్రభుత్వాలు దివాళా తీసి చాలా కాలం అయింది. పన్నులు వసూలు చేసి వడ్డీలు కట్టలేక ఇక వాటి పని ఎప్పుడో అయిపోయింది.


మేం ఫీజులు కట్టలేం అంటే అంతకు మించిన రాజకీయ ఆత్మహత్య సాదృశ్యం ఇంకోటి ఉండదు. అందుకే ప్రభుత్వాలు రెండేళ్లకో, మూడేళ్లకో రీయింబర్స్ మెంట్ విడుదల చేస్తుంటాయి. దబ్బులు లేకపోతే యాజమాన్యాలు జీతాలు ఎలా చెల్లిస్తాయి. ఎప్పుడో ఆరు నెలలకి ఓ సారి జీతాలు ఇస్తే అలాంటి ఉద్యోగాలకు ఎవరు వెళ్తారు. ఇప్పుడు నూటికి 90 శాతం ఇంజినీరింగ్ కళాశాలలో సరైన ఫ్యాకల్టీ  లేదు. మౌలిక సదుపాయాలు లేవు. కాలేజీ క్యాంపస్ లో మందు కొడుతూ.. డ్రగ్స్ తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ.. ప్రేమలు, లివ్ ఇన్ లు, ఫ్రెండ్షిప్ పేరుతో ఇతర కార్యక్రమాలు చేసేవారు కొందరు. ఇలా ఒకరిని చూసి మరొకరు చెడిపోతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరితే చదువు తప్ప అన్నీ వస్తాయి.


ఇలాంటి వారు బయటకు వస్తే ఉద్యోగాలు ఎలా. అసలు ఇలాంటి వారికి ఏ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి. అమెరికా ఉద్యోగాలు ఒక వెలుగు వెలిగనంత కాలం ఏదోలా గడిచిపోయింది. ఇప్పుడు పరిస్థితి తల కిందులు అయింది. అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న డిగ్రీ, పీజీ కలాశాలలు ఉన్నాయి.  బీఏ, బీకాం పరిస్థితి అత్యంత దారుణం.


కాలేజీలో చేరి మూడు నాలుగేళ్లు కాలక్షేపం చేసి ఆ తర్వాత రోడ్డుపై పడుతున్నారు. ఒక్క తెలంగాణలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటర్ తర్వాత చదువుకు దూరం అవుతున్నారు.  ఒకవేళ చేరినా కాలేజీకి పోరు. అమ్మా నాన్నలు సంపాదించిన డబ్బుతో డ్రగ్స్ కి బానిస అవుతున్నారు. అందరూ ఇంజినీర్లు కావాలనేది ఒకప్పటి కల. అలా అనుకున్న వారంతా డెలీవరీ బాయ్స్ గా, ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా మారిపోతున్నారు. ఫీజు రీయింబర్స్ మెట్ లక్ష్యం పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించడం. కానీ ఇప్పుడు సరైన సమయంలో వాటిని చెల్లించక లక్ష్యం నీరుగారి యువత పెడదోవ పడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>