PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kadiyam-kavya91c7f178-e8b8-45e3-be58-cfa557e729b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kadiyam-kavya91c7f178-e8b8-45e3-be58-cfa557e729b4-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో కడియం శ్రీహరి ఒకరు. ఈయన తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా మొదలు పెట్టారు. ఈ పార్టీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలంగాణ రాష్ట్రంలో మంచి నేతగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇకపోతే 2013 లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కడియం చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి కడియ. గెలుపొందారు. టిఆర్ఎస్ పార్టీలో శ్రీkadiyam kavya{#}srihari;MP;Loksabha;March;Congress;రాజీనామా;Party;Minister;MLA;Telugu Desam Party;Telanganaవారసులు.. రాజకీయాలు : కడియం శ్రీహరి వారసురాలిగా కావ్య సక్సెస్ అయినట్లేనా..?వారసులు.. రాజకీయాలు : కడియం శ్రీహరి వారసురాలిగా కావ్య సక్సెస్ అయినట్లేనా..?kadiyam kavya{#}srihari;MP;Loksabha;March;Congress;రాజీనామా;Party;Minister;MLA;Telugu Desam Party;TelanganaThu, 01 Aug 2024 08:16:14 GMTతెలంగాణలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో కడియం శ్రీహరి ఒకరు. ఈయన తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా మొదలు పెట్టారు. ఈ పార్టీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలంగాణ రాష్ట్రంలో మంచి నేతగా స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇకపోతే 2013 లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కడియం చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి కడియ. గెలుపొందారు. టిఆర్ఎస్ పార్టీలో శ్రీహరికి అద్భుతమైన గుర్తింపు దక్కింది. 2015 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా , విద్యాశాఖ మంత్రి గా కూడా ప‌ని చేశాడు.

ఆయన 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. కడియం 2024 మార్చి 31 న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇకపోతే ఈయన వారసురాలు అయినటువంటి కడియం కావ్య కూడా ఈయన అడుగుజాడల్లోనే నడుస్తుంది. అందులో భాగంగా ఈమె కూడా తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆమెను మార్చి 13 న వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించాడు. ఆమె మార్చి 29 న వరంగల్‌ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. కడియం కావ్య 2024 మార్చి 31న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది.

ఆమెను ఏప్రిల్ 1 న వరంగల్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆమె 2024 లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే గెలుపొందింది. ఇలా మొదటి ప్రయత్నంలోనే గెలుపొంది తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంది. ఇక రాబోయే రోజుల్లో కడియం కావ్య తన రాజకీయ జీవితాన్ని ఎలా ముందుకు సాగిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>