MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/what-about-the-crazy-news-about-on-releasing-movies-on-august-151bbe82b7-003a-4873-92f3-8bd7535521e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/what-about-the-crazy-news-about-on-releasing-movies-on-august-151bbe82b7-003a-4873-92f3-8bd7535521e9-415x250-IndiaHerald.jpg2024, ఆగస్టు 15న రవితేజ హీరోగా 'మిస్టర్ బచ్చన్' మూవీ, రామ్ పోతినేని హీరోగా 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రిలీజ్ కానున్నాయి. ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ రెండు సినిమాల మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ రిలీజ్ చేసి కొంచెం హైప్‌ పెంచేసారు. 'మిస్టర్ బచ్చన్' సినిమాను 'రైడ్' అనే హిందీ సినిమాకి అనువాదంగా హరీష్ శంకర్ తీశారు.Tollywood movie news{#}Ajay Devgn;Comedy;Sanjay Dutt;Audience;puri jagannadh;bollywood;Hindi;ram pothineni;Mister;harish shankar;Ravi;ravi teja;Cinemaఆగస్టు 15 రోజున రిలీజ్ చేస్తున్నా.. ఆ సినిమాలకు నో రెస్పాన్స్..??ఆగస్టు 15 రోజున రిలీజ్ చేస్తున్నా.. ఆ సినిమాలకు నో రెస్పాన్స్..??Tollywood movie news{#}Ajay Devgn;Comedy;Sanjay Dutt;Audience;puri jagannadh;bollywood;Hindi;ram pothineni;Mister;harish shankar;Ravi;ravi teja;CinemaThu, 01 Aug 2024 13:37:00 GMT
2024, ఆగస్టు 15న రవితేజ హీరోగా 'మిస్టర్ బచ్చన్' మూవీ, రామ్ పోతినేని హీరోగా 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రిలీజ్ కానున్నాయి. ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ రెండు సినిమాల మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ రిలీజ్ చేసి కొంచెం హైప్‌ పెంచేసారు. 'మిస్టర్ బచ్చన్' సినిమాను 'రైడ్' అనే హిందీ సినిమాకి అనువాదంగా హరీష్ శంకర్ తీశారు.

పూరి జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకి డైరెక్టర్. ఇది 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వల్. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. పూరి 'లైగర్' తరువాత రెండేళ్లు ఏ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ఆ రెండేళ్ల సమయంలో 'డబుల్ ఇస్మార్ట్' తీయడమే సరిపోయింది. అయితే రవితేజ, రామ్ పోతినేని సినిమాలకి ఇప్పుడు పెద్దగా బజ్ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

 మిస్టర్ బచ్చన్ టీజర్ మరీ కామెడీగా ఉందని చాలామంది ఈ సినిమాపై అప్పుడే నెగిటివ్ టాక్ మొదలు పెట్టేసారు. పైగా దీనికి మాతృక అయిన 'రైడ్' సినిమా ఓటీటీలో ఆల్రెడీ అందుబాటులో ఉంది. దాన్ని చాలా మంది చూసేశారు కూడా. ఇందులో అజయ్ దేవగన్ ఒక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా నటించి మెప్పించాడు. ఇది ఒక సీరియల్ రోల్ కానీ హరీష్ శంకర్ రవితేజ చేత బాగా కామెడీ చేయించాడని తెలుస్తోంది. ఆ రోజుకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఆయన చేసినట్టుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. టీజర్ లో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. ఈ కారణాల వల్లనే ఈ సినిమా పట్ల ఆశించిన బజ్ క్రియేట్ కావడం లేదు.

ఇక పూరి, రామ్ సినిమా కూడా ఎలాంటి రెస్పాన్స్ పొందలేకపోతోంది. 'లైగర్' ఫ్లాప్ ఈ సినిమాపై చాలా ప్రభావం చూపిస్తోంది. ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మొత్తం మీద ఈ మూవీని ఎవరైనా చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ మంచి రివ్యూస్ వస్తే ఈ సినిమాని చూసే అవకాశం ఉంటుంది. పేలవంగా రివ్యూస్ వస్తే పూరి జగన్నాథ్, రామ్ పోతినేని దుకాణం సర్దుకోవాల్సిందే. నిజానికి ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం లేదు. టికెట్ ఖర్చు ఎక్కువగా ఉండటం, స్నాక్స్ ధరలు కూడా ఆకాశాన్ని అంటడం వల్ల థియేటర్లకు రావాలంటేనే భయపడుతున్నారు.

 థియేటర్లో చూడకపోతే ఏంటి ఓటీటీల్లో నెల రోజుల్లోనే వస్తున్నాయి కదా అని చాలామంది థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంట్లోనే చాలా సౌకర్యవంతంగా ఫ్యామిలీతో కలిసి తక్కువ ఖర్చుతో వీటిని చూస్తున్నారు. ఇది కూడా ఈ రెండు సినిమాలకు ఒక పెద్ద మైనస్ కావచ్చు. రామ్ పోతినేని రవితేజ ఇద్దరు కూడా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నారు. వారికి ఈ సినిమాలు కూడా హ్యాండ్ ఇస్తే కెరీర్ పతనం అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>