PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/lpg-cylinder-ration-card-holders-will-get-a-gas-cylinder-for-rs-govts-new-scheme72ba3cdb-0a91-4985-b23d-faa0f1f14ec9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/lpg-cylinder-ration-card-holders-will-get-a-gas-cylinder-for-rs-govts-new-scheme72ba3cdb-0a91-4985-b23d-faa0f1f14ec9-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన హామీలలో ప్రజలను ఫ్రీ గ్యాస్ సిలిండర్ల హామీ ఎంతగానో ఆకట్టుకుంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెలలో అన్న క్యాంటీన్లు, ఉచిత బస్ స్కీమ్స్ మొదలుకానున్న నేపథ్యంలో దీపం పథకం అమలు ఎప్పుడనే చర్చ ప్రజల మధ్య జరుగుతోంది. gas cylinders{#}Smart phone;News;Andhra Pradesh;CMఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు అర్హులు వాళ్లు మాత్రమేనా.. వైరల్ వార్తల్లో నిజమెంత?ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు అర్హులు వాళ్లు మాత్రమేనా.. వైరల్ వార్తల్లో నిజమెంత?gas cylinders{#}Smart phone;News;Andhra Pradesh;CMThu, 01 Aug 2024 09:48:00 GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన హామీలలో ప్రజలను ఫ్రీ గ్యాస్ సిలిండర్ల హామీ ఎంతగానో ఆకట్టుకుంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెలలో అన్న క్యాంటీన్లు, ఉచిత బస్ స్కీమ్స్ మొదలుకానున్న నేపథ్యంలో దీపం పథకం అమలు ఎప్పుడనే చర్చ ప్రజల మధ్య జరుగుతోంది.
 
అయితే ఈ స్కీమ్ నియమ నిబంధనలు ఇవేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా కోటీ 30 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డ్ ప్రాతిపదికగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అమలు చేసే అవకాశాలు ప్రధానంగా ఉన్నాయని తెలుస్తోంది. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువగా గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ పథకం అందదని భోగట్టా.
 
అదే సమయంలో కరెంట్ బిల్స్, ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నంబర్, అడ్రస్ ఆధారంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు అర్హులను గుర్తించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మార్గదర్శకాలు అధికారికంగా మాత్రం వెల్లడైన మార్గదర్శకాలు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు విషయంలో కసరత్తు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనారం.
 
ఏపీ ప్రభుత్వం ఎంత వేగంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తే అంత మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ సూపర్ సిక్స్ హామీలను పక్కాగా అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పథకాల అమలు విషయంలో కూటమి సర్కార్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఆర్థిక భారం నేపథ్యంలో పథకాల అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ పథకం అమలు కోసం ప్రజలు సైతం ఒకింత ఎక్కువ ఆసక్తితోనే ఎదురు చూస్తున్నారనే సంగతి తెలిసిందే.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>