DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/cbn186ea379-5e61-4ef3-8a82-e019b10e23da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/cbn186ea379-5e61-4ef3-8a82-e019b10e23da-415x250-IndiaHerald.jpgచంద్రబాబు కూటమి ప్రభుత్వం తాజాగా పేదల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నగరాలు, గ్రామాల్లోని పేదలను గుర్తించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకం కింద కేంద్రం రూ.2.5 లక్షలకు తోడు రాష్ట్ర సర్కారు రూ.1.5 లక్షలను ఇచ్చి.. పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. దీనిని నగరాల్లో ఒక విధంగా.. గ్రామాల్లో మరోలా అమలు చేయనున్నారు. ఇది బృహత్తర పథకం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిని అమలు చేస్తే ఇళ్లు లేని పేదలు అంటూ ఉండరు అని కూడా వ్యాఖ్యానించారు. ఈ కcbn{#}Application;Jagan;CM;YCP;CBN;Governmentకొత్త స్కీమ్‌.. జగన్‌ను ఇరికించబోయి బాబే బుక్కయ్యారా?కొత్త స్కీమ్‌.. జగన్‌ను ఇరికించబోయి బాబే బుక్కయ్యారా?cbn{#}Application;Jagan;CM;YCP;CBN;GovernmentThu, 01 Aug 2024 12:00:00 GMTచంద్రబాబు కూటమి ప్రభుత్వం తాజాగా పేదల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నగరాలు, గ్రామాల్లోని పేదలను గుర్తించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకం కింద కేంద్రం రూ.2.5 లక్షలకు తోడు రాష్ట్ర సర్కారు రూ.1.5 లక్షలను ఇచ్చి.. పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. దీనిని నగరాల్లో ఒక విధంగా.. గ్రామాల్లో మరోలా అమలు చేయనున్నారు.


ఇది బృహత్తర పథకం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిని అమలు చేస్తే ఇళ్లు లేని పేదలు అంటూ ఉండరు అని కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని.. పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే భూములు ఇచ్చే విషయం కేంద్రానికి సంబంధం లేదు. అంటే చంద్రబాబు భూములను ఉచితంగా ఇస్తున్నారు అన్నమాట.


ఇది పైకి చూస్తే చాలా మంచి పథకం. ఎవరూ తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. అంతే కాదు జగన్ గతంలో సెంటు, సెంటున్నర స్థలాలనే ఇచ్చారు. దానితో పోల్చితే చంద్రబాబు ఇచ్చేది డబుల్ బోనంజా. అయితే దీంట్లో ఓ మెలిక పెట్టారు. గత వైసీపీ హయాంలో ఇప్పటికే ఇళ్లు తీసుకున్న వారికి ఈ పథకం వర్తింపజేయమని పేర్కొన్నారు.


ఇందులో చంద్రబాబు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే.. రాష్ట్రంలో అసలు లబ్ధిదారులు లేకపోవడమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గత జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 25 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ హామీ మేరకు విస్తృతంగా తనిఖీలు చేస్తే 25 లక్షలు కాస్తా 32 లక్షలు అయింది. వారిందరికీ జగన్ ఈ పథకంలో లబ్ధి చేకూర్చారు. వారంతా దరఖాస్తు కూడా చేసుకున్నారు. 22 లక్షల మందికి భూములు కూడా పంచి పెట్టారు. మరో 10 లక్షల మందికి దరఖాస్తులు ఓకే చేశారు. దీంతో వీరంతా గత ప్రభుత్వ లబ్ధిదారులుగా ఉన్నట్లే లెక్క. ప్రతి జిల్లాలో జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. సో ఇప్పుడు ఈ పథకంలో చంద్రబాబు ఇచ్చేందుకు రెడీ అయినా నిబంధనల ప్రకారం అర్హులు లేరు. దీంతో ఈ క్రెడిట్ ని జగన్ కొట్టేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>