MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amani-actors-amani-tollywood-tollywood-actorse96e4c3c-5823-4d5a-978d-595a09633b3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amani-actors-amani-tollywood-tollywood-actorse96e4c3c-5823-4d5a-978d-595a09633b3f-415x250-IndiaHerald.jpgసీనియర్ నటి ఆమని అంటే అందరికీ సుపరిచితమే.ఈమె తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. అయితే అలాంటి ఆమని టాలీవుడ్లోకి నరేష్ హీరోగా చేసిన జంబలకడి పంబ అనే మూవీతో వచ్చింది. అయితే అంతకంటే ముందే ఓ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో దాన్ని అందరూ మర్చిపోయారు. ఇక జంబలకడి పంబ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమనికి తెలుగు నాట అవకాశాలు పెరిగిపోయాయి.అలా అప్పట్లో ఉన్న సీనియర్ హీరోలందరితో నటించింది. కానీ చిరంజీవితో మాత్రం నటించలేక పోయిందట. ఇక రెండు మూడుసార్లు చిరంజీవి సినిమాలో amani; actors amani; tollywood; tollywood actors{#}Naresh;allari naresh;Sucide;Aamani;you tube;Interview;Ishtam;Chiranjeevi;marriage;Nijam;producer;Producer;Hero;Telugu;Cinema;Tollywoodఆ హీరో కోసం ఆమని సూసైడ్ చేసుకోవాలనుకుందా.?ఆ హీరో కోసం ఆమని సూసైడ్ చేసుకోవాలనుకుందా.?amani; actors amani; tollywood; tollywood actors{#}Naresh;allari naresh;Sucide;Aamani;you tube;Interview;Ishtam;Chiranjeevi;marriage;Nijam;producer;Producer;Hero;Telugu;Cinema;TollywoodThu, 01 Aug 2024 17:42:00 GMTసీనియర్ నటి ఆమని అంటే అందరికీ సుపరిచితమే.ఈమె తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. అయితే అలాంటి ఆమని టాలీవుడ్లోకి నరేష్ హీరోగా చేసిన జంబలకడి పంబ అనే మూవీతో వచ్చింది. అయితే అంతకంటే ముందే ఓ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో దాన్ని అందరూ మర్చిపోయారు. ఇక జంబలకడి పంబ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమనికి తెలుగు నాట అవకాశాలు పెరిగిపోయాయి.అలా అప్పట్లో ఉన్న సీనియర్ హీరోలందరితో నటించింది. కానీ చిరంజీవితో మాత్రం నటించలేక పోయిందట.


ఇక రెండు మూడుసార్లు చిరంజీవి సినిమాలో అవకాశాలు వచ్చినప్పటికీ చేయి దాకా వచ్చి అవి  చేజారిపోయాడట.అయితే అలాంటి ఆమని తమిళ ప్రొడ్యూసర్ అయినటు వంటి ఖాజా మొహీయిద్దిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి లేరు.అయితే ఆమని తన భర్తతో కలిసి లేకపోయినప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా ఫోన్లు చేస్తూ మాట్లాడుతుందట. అంతే కాకుండా పిల్లల బాధ్యత ఇద్దరూ తీసుకున్నారట. ఇక అప్పుడప్పుడు ఇద్దరు కలుసుకుంటారట కూడా. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడిందో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఖాజా మొహియుద్దిన్ కి ఆమని సినిమాల్లో నటించడం ఇష్టం లేదట. కానీ ఆమని మాత్రం సినిమాల మీద ఉన్న పిచ్చితో పిల్లల పుట్టి పెరిగాక మళ్ళీ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటిస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే అప్పట్లో ఆమని సూసైడ్ చేసుకోవాలనుకుంది అంటూ ఓ రూమర్ టాలీవుడ్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆమని టాలీవుడ్ లో ఉన్న ఓ హీరో కోసం ఆత్మహత్య చేసుకోవాలని చూసింది అంటూ కూడా మరో గాసిప్ వినిపించింది. అయితే ఈ రూమర్ లో ఎంత నిజం ఉంది అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా.. మీరు అడిగిన దాంట్లో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే సూసైడ్ చేసుకుంది నేను కాదు నా హస్బెండ్.. కానీ ఆ టైంలో నేను ఆయన దగ్గరే ఉండి హాస్పిటల్ లో ఉండేసరికి కొంతమంది ఈ విషయం తెలియక నేనే సూసైడ్ చేసుకున్నాను అని ప్రచారం చేశారు. ఇక మా ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారనే రూమర్ ప్రచారం చేశారు. కానీ ఇందులో కూడా ఇలాంటి  నిజం లేదు. అయితే అప్పట్లో ఆయన ప్రొడ్యూసర్ గా చేసిన సమయంలో కొంత మంది హీరోలు డేట్స్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ సినిమాలకు కమిట్ అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇక నేను సూసైడ్ చేసుకున్నాను అని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ ఆమని క్లారిటీ ఇచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>