Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-gadwal-vijayalakshmi-c8b47979-dbc9-4802-a067-56aa5246f925-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-gadwal-vijayalakshmi-c8b47979-dbc9-4802-a067-56aa5246f925-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా వారసులదే ఎక్కువగా హవా కొనసాగుతుంది. ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకుల ఫ్యామిలీల నుంచి కొడుకులు కోడళ్ళు కూతుళ్లు వారసులుగా రాజకీయాలకు పరిచయమైతున్నారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద పదవులను చేపడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాజకీయాల్లో కూడా వారసులుగా అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అయినా కేటీఆర్ తో పాటు కూతురు కవిత కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే వీరితోపాటు ఇటీవలే బిఆర్ఎKk{#}vijayalakshmi;Andaman;Rajya Sabha;Hyderabad;marriage;Telangana Chief Minister;KTR;Congress;Cabinet;Party;Success;kavitha;job;American Samoa;India;Cinema;Telugu;Father;Telangana;Andhra Pradeshతండ్రికి తగ్గ కూతురు గద్వాల విజయలక్ష్మి.. వీళ్ళ పొలిటికల్ ఎంట్రీ నిజంగా అనూహ్యమే?తండ్రికి తగ్గ కూతురు గద్వాల విజయలక్ష్మి.. వీళ్ళ పొలిటికల్ ఎంట్రీ నిజంగా అనూహ్యమే?Kk{#}vijayalakshmi;Andaman;Rajya Sabha;Hyderabad;marriage;Telangana Chief Minister;KTR;Congress;Cabinet;Party;Success;kavitha;job;American Samoa;India;Cinema;Telugu;Father;Telangana;Andhra PradeshThu, 01 Aug 2024 10:26:00 GMTఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా వారసులదే ఎక్కువగా హవా కొనసాగుతుంది. ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకుల ఫ్యామిలీల నుంచి కొడుకులు కోడళ్ళు కూతుళ్లు వారసులుగా రాజకీయాలకు పరిచయమైతున్నారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద పదవులను చేపడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాజకీయాల్లో కూడా వారసులుగా అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అయినా కేటీఆర్ తో పాటు కూతురు కవిత కూడా ఉన్నారు అని చెప్పాలి.



 అయితే వీరితోపాటు ఇటీవలే బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కేకే ఇక ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే కేకే రాజకీయ జీవితం ఎంతో ఆసక్తికరంగానే సాగింది. టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత జర్నలిస్టుగా మారాడు. మధ్యలో నటుడిగా కూడా ప్రేక్షకులను అలరించాడు. చివరికి రాజకీయాల వైపు టర్న్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులు చేపట్టాడు. కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మాత్రమే కాదు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు లాంటి నాలుగు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల బాధ్యతలను కూడా నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా మూడు ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.


 ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లో చేరి.. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. అయితే ఆయన రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన గద్వాల విజయలక్ష్మి ప్రస్థానం అలాగే సాగింది. జర్నలిజం, ఎల్.ఎల్.బి చేసిన గద్వాల విజయలక్ష్మి 1988లోనే బాబిరెడ్డిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు దంపతులు ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్లో అసిస్టెంట్ గా పనిచేసింది గద్వాల విజయలక్ష్మి. దాదాపు 18 ఏళ్ల పాటు అమెరికాలోనే ఉన్న ఆమె చివరికి మళ్ళీ 2007లో భారత్ తిరిగి వచ్చింది. రాజకీయాలపై ఆసక్తితో తండ్రి మద్దతు తీసుకొని 2016లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా గెలిచింది.


2021 లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి గెలిచి మేయర్ గా కూడా ఎన్నికైంది. ఇక ఇటీవల తండ్రి కేకేతో కలిసి కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా తండ్రి టీచర్ నుంచి జర్నలిస్టుగా జర్నలిస్ట్ నుంచి నటుడుగా నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగితే.. ఇక కూతురు కూడా తండ్రి బాటలోనే ముందు అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం మానేసి వచ్చి మరి రాజకీయాల్లో అడుగుపెట్టి సక్సెస్ అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>