PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government-ap-cm-chandrababu-ap-deputy-cm-pawan-kalyan-ap-ladies701263f4-d4fe-4740-a5f5-c20121de13fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government-ap-cm-chandrababu-ap-deputy-cm-pawan-kalyan-ap-ladies701263f4-d4fe-4740-a5f5-c20121de13fc-415x250-IndiaHerald.jpgఏపీలో మ‌హిళ‌లు మిస్స‌య్యార‌న్న‌ది నిజ‌మేన‌ని.. కానీ, అక్క‌డి నాయ‌కులు చెబుతున్న లెక్క‌లు అవాస్త వ‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది. ఇదేదో ప్రెస్ మీట్‌లో చెప్పిన మాట కాదు. నిండు పార్ల‌మెంటులో కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ వివ‌రాల‌తో స‌హా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో ఏది నిజం? అనేది బ‌య‌ట‌ప‌డింది. వైసీపీ హ‌యాంలో వ‌లంటీర్లు ఒంట‌రి మ‌హిళ‌లు, వితంతువుల‌ను గుర్తించి.. వారి డేటాను హైద‌రాబాద్‌లోని ఓ కంపెనీకి అందిస్తున్నార‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. త‌ర్వాత‌.. ఆయ‌న అధిAP government; ap cm chandrababu; AP deputy CM Pawan Kalyan; ap ladies{#}Red chilly powder;Press;central government;police;YCP;TDP;Chitram;Cinemaఏపీలో మ‌హిళ‌ల మిస్సింగ్ నిజం.. లెక్క‌లే అబద్ధం..!ఏపీలో మ‌హిళ‌ల మిస్సింగ్ నిజం.. లెక్క‌లే అబద్ధం..!AP government; ap cm chandrababu; AP deputy CM Pawan Kalyan; ap ladies{#}Red chilly powder;Press;central government;police;YCP;TDP;Chitram;CinemaThu, 01 Aug 2024 17:27:08 GMTఏపీలో మ‌హిళ‌లు మిస్స‌య్యార‌న్న‌ది నిజ‌మేన‌ని.. కానీ, అక్క‌డి నాయ‌కులు చెబుతున్న లెక్క‌లు అవాస్త వ‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది. ఇదేదో ప్రెస్ మీట్‌లో చెప్పిన మాట కాదు. నిండు పార్ల‌మెంటులో కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ వివ‌రాల‌తో స‌హా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో ఏది నిజం?  అనేది బ‌య‌ట‌ప‌డింది. వైసీపీ హ‌యాంలో వ‌లంటీర్లు ఒంట‌రి మ‌హిళ‌లు, వితంతువుల‌ను గుర్తించి.. వారి డేటాను హైద‌రాబాద్‌లోని ఓ కంపెనీకి అందిస్తున్నార‌ని.. జ‌న‌సేన  అధినేత ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.


త‌ర్వాత‌.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక‌.. ఈ విష‌యం మ‌రిచిపోయారు. కానీ, త‌ర‌చుగా వైసీపీ నాయ‌కు లు మాత్రం మ‌హిళ‌లు మిస్స‌య్యార‌ని చెబుతున్నారు క‌దా.. వెన‌క్కి తెప్పించండి.. మీరు అధికారంలో ఉన్నారు క‌దా? అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. కానీ, ప‌వ‌న్ ఎక్క‌డా రియాక్ట్ కావ‌డం లేదు. అయితే.. తాజాగా టీడీపీ ఎంపీ లు కొంద‌రు పార్ల‌మెంటులో తాజాగా ఈ ప్ర‌శ్నే సంధించారు. 2019-23 వ‌ర‌కు ఏపీలో ఎంత మంది మ‌హిళ‌లు, యువ‌తులు క‌నిపించ‌కుండా పోయారో లెక్క‌లు చెప్పాల‌ని  కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.


దీనికి కేంద్రం స‌మాధానం చెప్పింది. 2019-23 మ‌ధ్య ఏపీలో మ‌హిళ‌లు అదృశ్య మ‌య్యార‌నేది వాస్త‌వ‌మేన‌ని తేల్చి చెప్పింది. అయితే.. వీరిలో దాదాపు 99 శాతం మందిని వైసీపీ ప్ర‌భుత్వ‌మే వెతికి ప‌ట్టుకుని వెన‌క్కి తీసుకువ‌చ్చి కుటుంబాల‌కు అప్ప‌గించింద‌ని తేల్చి చెప్పింది. మొత్తం 44 వేల పైచిలుకు మ‌హిళ‌లు రాష్ట్రంలో అదృశ్య‌మ‌య్యార‌ని గ‌ణాంకాల‌తో స‌హా వెల్ల‌డించింది. వీరిలో 635 మంది మిన‌హా అంద‌రినీ వెన‌క్కి తీసుకువ‌చ్చార‌ని తెలిపింది.


అంతేకాదు.. అదృశ్య‌మైన మ‌హిళ‌ల కోసం వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ కూడా చేసింద‌ని పే ర్కొంది. ప్ర‌త్యేకంగా పోలీసు బ‌ల‌గాల‌ను నియ‌మించి.. అన్వేషించింద‌ని.. దీనికి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ కారం కూడా తీసుకుని.. సాద్య‌మైనంత వేగంగా వారిని వెన‌క్కి తీసుకువ‌చ్చింద‌ని.. కేంద్రం వెల్ల‌డించింది.  ఇలా వెన‌క్కి వ‌చ్చిన వారిపై ఎలాంటి అఘాయిత్యాలూ జ‌ర‌గ‌లేద‌ని కేంద్రం తెలిపింది.


దీంతో అస‌లు వాస్త‌వం ఏంట‌నేది తేలిపోయింది. అయితే..ఇ క్క‌డ చిత్రం ఏంటంటే.. గ‌తంలో మ‌హిళ‌లు అదృశ్య మ‌య్యారంటూ.. పెద్ద ఎత్తున బ్యాన‌ర్ ఐటంలు ఇచ్చిన ప‌త్రిక‌లుకానీ.. పెద్ద ఎత్తున గొంతు చించుకున్న నాయ‌కులు కానీ.. ఒక్క‌రంటే ఒక్క‌రు ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డ‌మే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>