Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya61402307-df1b-4541-bd02-008f8befab46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya61402307-df1b-4541-bd02-008f8befab46-415x250-IndiaHerald.jpgసాధారణంగా బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు ఈ హడావిడి రెట్టింపు కానుంది. ఎందుకంటే ఇక ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే అటు బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో రిటైన్షన్ ప్రక్రియ గురించి చర్చలు జరుపుతూ ఉంది అనిSurya{#}surya sivakumar;Mumbai;Hardik Pandya;Suryakumar Yadav;BCCI;Punjab;Lucknow;Heart;media;India;Indianఐపీఎల్ 2025 : సూర్య కుమార్ పై.. కన్ను వేసిన ఆ మూడు జట్లు?ఐపీఎల్ 2025 : సూర్య కుమార్ పై.. కన్ను వేసిన ఆ మూడు జట్లు?Surya{#}surya sivakumar;Mumbai;Hardik Pandya;Suryakumar Yadav;BCCI;Punjab;Lucknow;Heart;media;India;IndianThu, 01 Aug 2024 09:45:00 GMTసాధారణంగా బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు ఈ హడావిడి రెట్టింపు కానుంది. ఎందుకంటే ఇక ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఇప్పటికే అటు బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో రిటైన్షన్ ప్రక్రియ గురించి చర్చలు జరుపుతూ ఉంది అని తెలుస్తుంది. వచ్చే మూడేళ్ల పాటు ఇదే జట్టు కొనసాగుతున్న నేపద్యంలో ఆచి  తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్ని ఫ్రాంచైజీలు. ఆటగాళ్లు కూడా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా టి20 కెప్టెన్ గా  సాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై సూర్య అసంతృప్తిగా ఉన్నాడట.


 గతంలోనే సోషల్ మీడియా వేదికగా హార్ట్ బ్రేక్ సింబల్ పెట్టి తన అసంతృప్తిని తెలియజేశాడు. కెప్టెన్సీ కోసం అతను మెగా వేలం లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ వేలం లోకి వస్తే ఏకంగా మూడు జట్లు అతని కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అలాంటి టీమ్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు స్థానంలో ఉంది అనేది తెలుస్తుంది. ఆ జట్టు టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు కొత్త కెప్టెన్ ను ఎంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్గా ఉన్న డూప్లెసెస్ ను.. ఇక టీం వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ వేలంలోకి వస్తే అతని కోసం ఎంత ఖర్చు చేసి అయినా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.


 ఇప్పటివరకు సరైన కెప్టెన్ లేక ఇబ్బంది పడుతున్న పంజాబ్ కింగ్స్ కూడా సూర్యకుమార్ ని తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సూర్య కోసం కోట్లు కుమ్మరించేందుకు కూడా రెడీగా ఉందట. మరోవైపు లక్నో జట్టు కూడా కొత్త కెప్టెన్ కోసం వేట మొదలు పెట్టగా.. సూర్యను తీసుకుంటే బాగుంటుందని ఆ జట్టు యాజమాన్యం అనుకుంటుందట. మరి టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా ఉన్న సూర్య ఏ టీమ్ లోకి వెళ్తాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>