MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood520acd0a-2dad-474d-b202-561a72a02c11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood520acd0a-2dad-474d-b202-561a72a02c11-415x250-IndiaHerald.jpgఅశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం శివం భజే. డైరెక్టర్ అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ నేడు ఆగస్టు 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అశ్విన్ ఇదివరకే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరి శివం భజే సినిమా కథ ఏంటి ఈ కథ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే... కథ: చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఎజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారి tollywood{#}Shivam;chandu;Reddy;Fidaa;job;Darsakudu;Romantic;Chitram;king;Director;Hero;Cinemaశివం భజే సినిమా రివ్యూ అండ్ రేటింగ్!శివం భజే సినిమా రివ్యూ అండ్ రేటింగ్!tollywood{#}Shivam;chandu;Reddy;Fidaa;job;Darsakudu;Romantic;Chitram;king;Director;Hero;CinemaThu, 01 Aug 2024 17:10:00 GMTఅశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం శివం భజే. డైరెక్టర్ అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ నేడు ఆగస్టు 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అశ్విన్ ఇదివరకే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరి శివం భజే సినిమా కథ ఏంటి ఈ కథ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే...

కథ: చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఎజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంటాడు. ఈ తరుణంలోనే చందుకి శైలజ(దిగంగనా సూర్యవంశీ) కనపడుతుంది. ఈమెను చూడగానే చందు ప్రేమలో పడతాడు. శైలజ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే, ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందుకి తిరిగి కళ్ళు ఆపరేషన్ జరిగి కంటి చూపు వస్తుంది. ఎప్పుడైతే ఈయనకు సర్జరీ జరుగుతుందో అప్పటినుంచి తన కళ్ళకు వివిధ రకాల విజువల్స్ కనపడుతూ ఉంటాయి. మరి ఈయనకు పెట్టిన ఆ కళ్ళు ఎవరివి తనకు ఎలాంటి విజువల్స్ కనిపిస్తాయి శివుడి అనుగ్రహంతో చందు ఎలాంటి కార్యం పూర్తి చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

నటీనటులు: హీరో అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రాజు గారి గది సినిమాల ద్వారా తన నటనతో మెప్పించారు.దిగంగనా సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఇక హైపర్ ఆది, ఇతర నటీనటులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.

టెక్నికల్:  దర్శకుడు అప్సర్‌ రాసుకున్న పాయింట్ బాగుంది.. పాత్రలను ఎంచుకున్న తీరు.. మల్చుకున్న విధానం బాగుంది.. కొత్త పాయింట్‌తో అప్సర్ అందరినీ ఆకట్టుకుంటాడు. టెక్నికల్ టీంని చక్కగా వాడుకున్నాడు. అందరి దగ్గరి నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. శివం భజేలో అన్ని రకాల అంశాలను మేళవించాడు దర్శకుడు. మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్, డివోషనల్, కామెడీ, రొమాంటిక్ యాంగిల్ ఇలా అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా మంచి స్క్రిప్ట్‌తో వచ్చాడు. కొత్త పాయింట్‌తో ఆడియెన్స్ ఆశ్చర్యపరుస్తాడు. అప్సర్ టేకింగ్, మేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవ్వాల్సిందే.



విశ్లేషణ: డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. కథ కాస్త నెమ్మదిగా కొనసాగుతుంది. ఇక మొదటి భాగంలో అవసరమైన సన్నివేశాలను మిస్ చేయడమే కాకుండా కథను కొనసాగింపడం కోసం అనవసరమైన సన్నివేశాలను చేర్చినట్టు తెలుస్తుంది ఇదే ఈ సినిమాకి మైనస్ గా మారింది. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో అంచనాల నడుమ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినా సినిమా మొత్తం ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

రేటింగ్: 3/5







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>