MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-new-movie-souryav-directer5024eed5-16f1-4394-be73-18f6c00d5687-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-new-movie-souryav-directer5024eed5-16f1-4394-be73-18f6c00d5687-415x250-IndiaHerald.jpgRRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొలటాల శివ దర్శకత్వంలోనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం చేత పోస్ట్ ఫోన్ చేసుకోవడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నలJR.NTR;NEW MOVIE;SOURYAV DIRECTER{#}Saif Ali Khan;Shiva;prasanth;lord siva;Nijam;Prashant Kishor;NTR;Smart phone;News;Thriller;Jr NTR;Director;bollywood;India;Father;Cinemaకుర్ర డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. మళ్లీ రెండు భాగాలా..?కుర్ర డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. మళ్లీ రెండు భాగాలా..?JR.NTR;NEW MOVIE;SOURYAV DIRECTER{#}Saif Ali Khan;Shiva;prasanth;lord siva;Nijam;Prashant Kishor;NTR;Smart phone;News;Thriller;Jr NTR;Director;bollywood;India;Father;CinemaThu, 01 Aug 2024 10:40:00 GMTRRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొలటాల శివ దర్శకత్వంలోనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం చేత పోస్ట్ ఫోన్ చేసుకోవడం జరిగింది.


ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా యంగ్ డైరెక్టర్ కి అన్నట్లుగా సమాచారం. గత ఏడాది హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ శౌర్యవ్ జూనియర్ ఎన్టీఆర్కు ఒక యాక్షన్ థ్రిల్లర్ కథ వినిపించారట. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉందని తెలిసినప్పటికీ 2026 లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలా ప్లాన్ చేసుకుంటున్నాట్లు తెలుస్తోంది.



ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మూడు భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నారు. అలాగే దేవర సీక్వెల్  తో పాటు బాలీవుడ్ లో వార్-2 , అలాగే ప్రశాంత్ నిల్ తో కూడా ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాతే యంగ్ డైరెక్టర్ శౌర్యవ్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 2026 లో ఈ సినిమా ఒకవేళ మొదలయితే 2028లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.అలాగే 2030వ సంవత్సరంలో రెండో భాగాన్ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడైతే  జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>