EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiaf1c7ddae-c27c-4ec2-918f-38275c98bf11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiaf1c7ddae-c27c-4ec2-918f-38275c98bf11-415x250-IndiaHerald.jpgప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉద్యోగుల యూనియన్ ఇటీవల కేరళలో రాష్ట్ర సభ నిర్వహించింది. కార్గిల్ యుద్ధ విజయం 25 సం.ల వేడుకలు దేశం అంతా నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ మాత్రం తమ మీటింగ్ లో పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కి సంస్మరణ ప్రకటించడానికి నిర్ణయించి పోస్టర్స్ కూడా వేసింది. అయితే బీజేపీ, కొన్ని హిందూ సంస్థలు ఆ మీటింగ్ హాల్ వద్ద పెద్ద గొడవ చేయడంతో సదరు యూనియన్ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అసలు జరిగింది ఏంటంటే… కేరళ అలప్పుజాలో జరిగిన బ్యాంకు ఆఫ్ ఇండియా స్టాఫindia{#}Kerala;India;Pakistan;Bangladesh;West Bengal - Kolkata;Bank;war;Terrorists;Pervez Musharraf;Mamta Mohandasభారత దేశం ముక్కలు అవుతుందా.. ఇలాగైతే ఎలా?భారత దేశం ముక్కలు అవుతుందా.. ఇలాగైతే ఎలా?india{#}Kerala;India;Pakistan;Bangladesh;West Bengal - Kolkata;Bank;war;Terrorists;Pervez Musharraf;Mamta MohandasThu, 01 Aug 2024 08:14:00 GMTప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉద్యోగుల యూనియన్ ఇటీవల కేరళలో రాష్ట్ర సభ నిర్వహించింది. కార్గిల్ యుద్ధ విజయం 25 సం.ల వేడుకలు దేశం అంతా నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ మాత్రం తమ మీటింగ్ లో పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కి సంస్మరణ ప్రకటించడానికి నిర్ణయించి పోస్టర్స్ కూడా వేసింది.


అయితే బీజేపీ, కొన్ని హిందూ సంస్థలు ఆ మీటింగ్ హాల్ వద్ద పెద్ద గొడవ చేయడంతో సదరు యూనియన్  ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అసలు జరిగింది ఏంటంటే… కేరళ అలప్పుజాలో జరిగిన బ్యాంకు ఆఫ్ ఇండియా స్టాఫ్ రాష్ట్ర సదస్సులో నివాళులు అర్పించే జాబితాలో పాక్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ పేరు పోస్టర్స్ లో రావడంతో కేరళలో వివాదం చెలరేగింది.


అది బీజేపీ, ఇతర జాతీయ వాద సంస్థలు గొడవ చేయడంతో ఇది ప్రింటింగ్ పొరపాటు అని, పొరపాట్లు జరిగినట్లు తెలియగానే దానిని సరిచేసుకున్నామని ఆ యూనియన్ పేర్కొంది. ఆ తర్వాత ముషారఫ్ పేరు లేకుండానే కార్యక్రమం నిర్వహించారు. ఏంటి అంత పెద్ద యూనియన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు పోస్టర్స్ ఫ్రూఫ్ రీడింగ్ చూసుకోకుండానే డెలీవరీ తీసుకొని పోస్టర్స్ అంటించారా అనే సందేహం కలగక మానదు.


కమ్యూనిస్టులది ఎప్పుడూ ఇలాగే దేశ వ్యతిరేక భావజాలమే అని కొందరు రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. అది 1962 యుద్ధం కావొచ్చు. పాక్ తో చర్చలు జరిపిన సమయంలో కావొచ్చు. లేదా కశ్మీర్ కి సంబంధించి స్వయం ప్రతిపత్తి విషయంలో కావొచ్చు. అన్నిటిలో వారి మద్దతు అటువైపుగానే పాకిస్థాన్ కి అనుకూలంగా ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నిరాశ్రయులకు తాము ఆశ్రయం కల్పిస్తామని బహిరంగంగా ప్రకటించారు.  ఇప్పటికే బెంగాల్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకువస్తున్నారన్న భారత నిఘా వర్గాలు ఓ వైపు చెబుతున్నా.. ఆమె వాటిని ఖాతరు చేయకుండా ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు ఘటనలు దేశాన్ని ముక్కలు చేసే కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>