PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sc-stfeebd5fc-e378-4fe3-a9ac-02a461ed8135-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sc-stfeebd5fc-e378-4fe3-a9ac-02a461ed8135-415x250-IndiaHerald.jpgఆగస్ట్‌ 1వ తేదీ అంటే ఈ రోజు చరిత్రలో మిగిలిపోనుంది. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీ లకు లభించిన రిజర్వేషన్లలో వర్గీకరణ ను ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ ల్లోని ఉపకులాలకు, సబ్ కోటా రిజర్వేషన్లను అనుమతించింది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఏడుగురు న్యాయమూర్తుల్లో, జస్టిస్ బేలా త్రివేది మినహాయించి, మిగిలిన ఆరుగురు న్యsc st{#}Scheduled caste;Scheduled Tribes;2020;Haryana;Supreme Court;Punjab;High court;Andhra Pradesh;Teluguఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా !ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా !sc st{#}Scheduled caste;Scheduled Tribes;2020;Haryana;Supreme Court;Punjab;High court;Andhra Pradesh;TeluguThu, 01 Aug 2024 12:17:00 GMTఆగస్ట్‌ 1వ తేదీ అంటే ఈ రోజు చరిత్రలో మిగిలిపోనుంది. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీ లకు లభించిన రిజర్వేషన్లలో వర్గీకరణ ను ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ ల్లోని ఉపకులాలకు, సబ్ కోటా రిజర్వేషన్లను అనుమతించింది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఏడుగురు న్యాయమూర్తుల్లో, జస్టిస్ బేలా త్రివేది మినహాయించి, మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు ఇచ్చారు. సబ్ కోటా రిజర్వేషన్ల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు మాదిగలు.


అసలు ఈ కేసు వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ కోట రిజర్వేషన్ 50% వాల్మీకి అలాగే,  సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకించి 2006లో పంజాబ్... ఓ కొత్త చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ల సబ్ వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ అలాగే హర్యానా హైకోర్టులు 2010 సంవత్సరంలో తీర్పులు ఇవ్వడం జరిగింది.

 

ఇక ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు... 2004లో వెలువరించిన తీర్పులు ఉల్లంఘించేలా... పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.  షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలంటే, లేదా తొలగించాలంటే ఒకేలా పార్లమెంటుకు అధికారం ఉంటుంది. కానీ శాసనసభలకు ఉండదని... ఇవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

2004లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్నే పంజాబ్ అలాగే హర్యానా తమ ఉత్తర్వులు హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఇక ఆ హైకోర్టు తీర్పును.. పంజాబ్ ప్రభుత్వం  వ్యతిరేకించి సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ తరుణంలోనే 22 పిటిషన్లు కూడా వేశారు. ఇందులో మందకృష్ణ మాదిగ కూడా ఉన్నారు. ఈ తరుణంలో 2020 సంవత్సరంలో ఈ కేసును విస్తృత ధర్మసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ... తీర్పు ఇవ్వడం జరిగింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>