PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-tdp-party-lokesh-nara-family-ap-politics-sr-ntr17006995-ede1-4629-8438-995f8f31d2e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-tdp-party-lokesh-nara-family-ap-politics-sr-ntr17006995-ede1-4629-8438-995f8f31d2e0-415x250-IndiaHerald.jpgరాజుల కాలం నుంచి వారసత్వాలు ఉన్నాయి. అప్పట్లో రాజుల పాలనలో తండ్రుల తర్వాత కొడుకులు,కొడుకుల తర్వాత మనవళ్ళు ఇలా వారి వారసులే దేశాన్ని పాలిస్తూ వచ్చేవారు. అలా అప్డేట్ అవుతూ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎన్నుకునే రాజకీయ పార్టీల్లో కూడా వారసత్వం పెరిగిపోయింది. అలాంటి రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో నారా లోకేష్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా ఎన్నికైనటువంటి నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒకప్పుడు నారా లోకేష్ ను పప్పు అని పిలిచేవారు. కానీ CHANDRABABU;TDP PARTY;LOKESH; NARA FAMILY;AP POLITICS;SR.NTR{#}NTR;pragathi;Telugu Desam Party;Kartha;Nara Lokesh;Cabinet;Mangalagiri;Yuva;Prasthanam;Minister;Andhra Pradesh;Father;MLA;TDPప్రజలు మెచ్చిన నాయకుడు చంద్రన్న వారసుడు.!ప్రజలు మెచ్చిన నాయకుడు చంద్రన్న వారసుడు.!CHANDRABABU;TDP PARTY;LOKESH; NARA FAMILY;AP POLITICS;SR.NTR{#}NTR;pragathi;Telugu Desam Party;Kartha;Nara Lokesh;Cabinet;Mangalagiri;Yuva;Prasthanam;Minister;Andhra Pradesh;Father;MLA;TDPThu, 01 Aug 2024 07:49:00 GMT-పప్పు అనే స్థాయి నుంచి నిప్పుగా ఎదిగాడు..
- క్యాబినెట్ మంత్రిగా తన మార్క్ చూపిస్తున్నాడు..
- నారా లోకేషా మజాకా..


రాజుల కాలం నుంచి వారసత్వాలు ఉన్నాయి. అప్పట్లో రాజుల పాలనలో తండ్రుల తర్వాత కొడుకులు,కొడుకుల తర్వాత మనవళ్ళు ఇలా వారి వారసులే దేశాన్ని పాలిస్తూ వచ్చేవారు. అలా అప్డేట్ అవుతూ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎన్నుకునే రాజకీయ పార్టీల్లో కూడా వారసత్వం పెరిగిపోయింది. అలాంటి రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో నారా లోకేష్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా ఎన్నికైనటువంటి నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 చంద్రన్న కొడుకుగా అరంగేట్రం:
ఒకప్పుడు నారా లోకేష్ ను పప్పు అని పిలిచేవారు. కానీ నారా లోకేష్ ఇవన్నీ పట్టించుకోకుండా తనంతట తానే స్వయంగా ఎదగడం కోసం ఎంతో కష్టపడ్డాడు. యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి 226 రోజులపాటు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్య స్ఫూర్తిని నింపాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త కర్మ క్రియగా మారి ప్రజలకు ఆదుకునే నాయకుడిగా మారాడు. అలా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి పొంది, మూడు శాఖలను ప్రగతి పథంలో పరుగులు పెట్టించిన కీలక నాయకుడు. ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కానీ ఓడినా వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలోనే ఉంటూ, ఓడిన చోటే మళ్లీ గెలవాలనే పట్టుదలతో పేద ప్రజలకు బాసటగా నిలిచాడు. తన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు మొదలుపెట్టాడు. తన సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరికీ దేవుడులా మారాడు. తాత ఎన్టీఆర్ నినాదం నాన్న విధానం అందిపుచ్చుకొని నారా లోకేష్ ఏ పార్టీకి కూడా లేనటువంటి కార్యకర్తల సంక్షేమ విధానాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారు. 2014 మహానాడు వేదికగా యువ విభాగం ఆవిర్భావం నుంచి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం,ఆర్థిక అవసరాలు తెలుసుకుంటూ వారికి కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారికి రెండు లక్షల ప్రమాద భీమా అందిస్తున్నారు.
 
రాజకీయ ప్రస్థానం:
 2013లో రాజకీయ అరంగేట్రం చేసి2014 టిడిపి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు. టిడిపి నాయకత్వ శిక్షణా శిబిరాల ద్వారా  25 వేల మంది యువ నాయకులను తయారు చేశాడు నారా లోకేష్. 2017 లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యాడు. 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఐటి ఎలక్ట్రానిక్స్  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ  మంత్రిగా సేవలందించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైనటువంటి పొలిటికల్ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. అలా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 91, 413 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని సాధించి టిడిపి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>