MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/samantha-13a21393-89d5-44dc-bf8c-9c910d91a503-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/samantha-13a21393-89d5-44dc-bf8c-9c910d91a503-415x250-IndiaHerald.jpg‘సిటాడెల్: హనీ బన్నీ’ టీజర్ విడుదల.. హాలీవుడ్ రేంజ్.. సామ్ కుమ్మేసింది భయ్యా? 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' వంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను తెరకెక్కిన రాజ్, డీకే దర్శకత్వంలో రాబోతున్న మరో యాక్షన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'. సమంతా రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అదిరిపోయే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సిరీస్ కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ ఒక కీలక అప్ డేట్ ఇచ్చిన సంగతి తేలిసిందే. ఇన్ స్టాCitadel{#}sam;Sam Mendes;Avatar;August;Blockbuster hit;Thriller;Varun Dhawan;Hindi;Hollywood;Amazon;November;Audience;Samantha;India‘సిటాడెల్: హనీ బన్నీ’ టీజర్ విడుదల.. హాలీవుడ్ రేంజ్.. సామ్ కుమ్మేసింది భయ్యా?‘సిటాడెల్: హనీ బన్నీ’ టీజర్ విడుదల.. హాలీవుడ్ రేంజ్.. సామ్ కుమ్మేసింది భయ్యా?Citadel{#}sam;Sam Mendes;Avatar;August;Blockbuster hit;Thriller;Varun Dhawan;Hindi;Hollywood;Amazon;November;Audience;Samantha;IndiaThu, 01 Aug 2024 17:30:00 GMT 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' వంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను తెరకెక్కిన రాజ్, డీకే దర్శకత్వంలో రాబోతున్న మరో యాక్షన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'. సమంతా రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అదిరిపోయే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సిరీస్ కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ ఒక కీలక అప్ డేట్ ఇచ్చిన సంగతి తేలిసిందే. ఇన్ స్టా వేదికగా ’01.08’ అంటూ కూడా పోస్టు పెట్టింది. అయితే, ఈ సిరీస్ ఆగష్టు 1న విడుదల అవుతుందని ఫ్యాన్స్ అందరూ భావించారు. అయితే, సిరీస్ ను రిలీజ్ చేయలేదు గానీ, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబడంతో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సమంతా, వరుణ్ ధావన్ కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ఎంతగానో మెస్మరైజ్ చేశారు. హాలీవుడ్ ‘సిటాడెల్’కు ఏమాత్రం తీసిపోని రీతిలో రాజ్, డీకే ఈ సిరీస్ ను తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ కలబోతతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది. అటు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్న 'రాత్ బాకీ' అనే హిందీ పాట టీజర్ లో మరింత హైలెట్ గా కూడా నిలిచింది. 


ఈ టీజర్ సిరీస్ పై ఓ రేంజ్ లో అంచనాలు పెంచుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సికిందర్ ఖేర్, కేకే మీనన్, షకీబ్ సలీమ్, సిమ్రన్, సోహమ్ మజుందార్ కీలక పాత్రలు పోషించడం జరిగింది. భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ను భారత్ తో పాటు సైబీరియాలో కూడా తెరకెక్కించారు.ఈ ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ లో సామ్ పూర్తి డిఫరెంట్ అవతార్ లో కనిపించబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్2’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సమంత ఈ సిరీస్ కోసం స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఈ సిరీస్ లో వరుణ్, సమంతా కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు ఆధరగొట్టేసాయి.ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. 1990ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో చాలా చోట్ల సమంతా అసలు డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేసినట్లు తెలుస్తోంది. ‘ సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న అమెజాన్ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.
" style="height: 370px;">

" style="height: 370px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>