Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan3f564da5-3cc6-49b1-9f85-be1d5ae31062-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan3f564da5-3cc6-49b1-9f85-be1d5ae31062-415x250-IndiaHerald.jpgసినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీలు అందరూ కూడా ఎంతో అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే తెరమీద చూసి ఇది నిజమే అని భావిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రేక్షకులు.. సినిమా వాళ్లకి కష్టాలు అనేవి ఉండవు. జీవితం అంటే వాళ్లది అని అనుకుంటూ ఉంటారు.కానీ సినిమా వాళ్ళు పడే కష్టం తెలిసినప్పుడు ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారూ. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఆడుతుందో లేదో అనే భయం నిర్మాతల్లో ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇక తమ కెరియర్ పై ప్రభావం చూపుతుందేమో అని నటీనటులు భయం. సినిమా ప్లాప్ అయిJagan{#}Nagababu;Pawan Kalyan;Father;Janasena;Assembly;Chiranjeevi;Jagan;CM;Telugu;Cinema;Partyసినీ రాజకీయం : చిరంజీవి పెట్టిన ఆ ఒక్క నమస్కారం.. జగన్ కు సీఎం కుర్చీనే దూరం చేసింది?సినీ రాజకీయం : చిరంజీవి పెట్టిన ఆ ఒక్క నమస్కారం.. జగన్ కు సీఎం కుర్చీనే దూరం చేసింది?Jagan{#}Nagababu;Pawan Kalyan;Father;Janasena;Assembly;Chiranjeevi;Jagan;CM;Telugu;Cinema;PartyWed, 31 Jul 2024 11:00:00 GMTసినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీలు అందరూ కూడా ఎంతో అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే తెరమీద చూసి ఇది నిజమే అని భావిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రేక్షకులు.. సినిమా వాళ్లకి కష్టాలు అనేవి ఉండవు. జీవితం అంటే వాళ్లది అని అనుకుంటూ ఉంటారు.కానీ సినిమా వాళ్ళు పడే కష్టం తెలిసినప్పుడు ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారూ.  కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఆడుతుందో లేదో అనే భయం నిర్మాతల్లో ఉంటుంది.


ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇక తమ కెరియర్ పై ప్రభావం చూపుతుందేమో అని నటీనటులు భయం. సినిమా ప్లాప్ అయితే పెట్టిన పెట్టుబడి రాదేమో అని డిస్ట్రిబ్యూటర్ల భయం.. ఇలా భయం భయంగానే సినిమా ఇండస్ట్రీ సాగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు చాలవు అని కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రభుత్వాల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.


 జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఫై కక్ష సాధింపులో భాగంగా ఏకంగా టికెట్ రేట్లను అమాంతం తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 దీంతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే నష్టాలు తప్పవని భావించి భయపడిన సందర్భంలో ఇక ఇండస్ట్రీకి పెద్దగా కొనసాగిన చిరంజీవి జగన్తో పలుమార్లు భేటీ అయ్యారు. ఒకానొక సమయంలో ఏకంగా చిరంజీవి అంతటి వ్యక్తి జగన్కు చేతులెత్తి నమస్కరించి మరి మీ తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను.. టికెట్ రేట్లు పెంచి చిత్ర పరిశ్రమను కాపాడండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.


అయితే ఇలా చిరంజీవి నమస్కరిస్తుంటే జగన్ మాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఉండటం ఎవరికి నచ్చలేదు. చిరంజీవి ఇండస్ట్రీ కోసం ఎంతో చేశారని.. అలాంటి మహోన్నత వ్యక్తిని ఇలా అవమానించడం తగదు అంటూ జగన్ తీరుపై ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇక ఆ పార్టీ నేత నాగబాబు సైతం తెరమీదకి తీసుకొస్తూ జగన్ ప్రభుత్వంఫై విమర్శలు గుప్పించారు. ఇలా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న చిరంజీవితో ఏకంగా నమస్కారం పెట్టినా.. ఆయన రిక్వెస్ట్ ను పట్టించుకోని జగన్కు బుద్ధి చెప్పాలని అప్పుడే సినిమా వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇక అందరి హీరోల అభిమానులు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు ఘోర ఓటమి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇలా చిరంజీవి పెట్టిన ఒక్క నమస్కారం చివరికి జగన్ పై ఉన్న వ్యతిరేకతను డబుల్ చేసింది. అంతేకాదు సీఎం కుర్చీని  దూరం చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>